ఎమ్మెల్యేను ప్రశ్నించిన జర్నలిస్ట్ పై దాడి....వీడియో వైరల్
X
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే కిషోర్ పాటిల్ అనుచరులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన జర్మలిస్ట్‌పై దాడికి దిగారు. నడిరోడ్డుపైనే విచక్షణ రహితంగా చావబాదారు. అతడు కిందపడిపోయనా వదలకుండా చితక్కొట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగాన్ జిల్లా పచోరాలో చోటు గురువారం ఉదయం చోటు చేసుకుంది.
ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో ఎమ్మెల్యే కిషోర్ పాటిల్‌ను ఓ సమావేశంలో సదరు జర్నలిస్ట్ ప్రశ్నించాడు. అతడు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే ఇబ్బందికి గురయ్యారు. దీంతో సమావేశం అనంతరం ఆ జర్నలిస్ట్‌కు ఫోన్ చేసి బెదిరించారు. తమ నాయకుడిని ప్రశ్నించారని కక్ష పెంచుకున్న ఎమ్మెల్యే అనుచరులు గురువారం ఉదయం ఆ విలేకరిపై దాడి చేశారు. రోడ్డుపై వెళ్తుండగా అడ్డగించి మరి కొట్టారు. దాడి దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
महाराष्ट्र में पत्रकार संदीप महाजन को बीच सड़क पर पीटा गया। 👇
— Srinivas BV (@srinivasiyc) August 10, 2023
पत्रकार का गुनाह ये था कि उसने एक 8 साल की बच्ची के बलात्कार और हत्या का मामला उठाया। विधायक व सीएम एकनाथ शिंदे से सवाल पूछे और न्याय की मांग की। pic.twitter.com/xZ1QGrSOmS