పవిత్రమైన పానీపూరి నీళ్లు.. భూతద్దంలో పెట్టి చూస్తే..!
X
పానీ పూరి.. ఇండియన్ ఫేవరెట్ స్నాక్. హోటల్స్ లో, రోడ్ల పక్కన ఎక్కడ పానీ పూరి బండి కనిపించినా.. ఓ ప్లేట్ లాగించేస్తుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లొట్టలేసుకుని తింటారు. పానీ పూరీ వల్ల కలిగే నష్టాలను కవులు వివరించినా, డాక్టర్లు పూసగుచ్చినట్లు చెప్పినా, వాటి తయారీ వీడియోల్లో లీక్ చేసినా.. ఇష్టమున్న వాళ్లు తింటూనే ఉంటారు. తాజాగా మరోసారి పానీపూరి వార్తల్లో నిలిచింది. పానీపూరీ నీళ్లకు సంబందించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. అది చూసిన వాళ్లంతా.. ఇది చాలా కామన్ అంటుంటే, మరికొందరు కడుపులో తిప్పుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కోబ్రా ఎక్స్ పరిమెంట్స్ (cobraexperiments) పానీపూరీ నీళ్లపై ఓ ప్రయోగం చేసింది. రోడ్డుపై ఉన్న బండి దగ్గర పానీపూరీ నీళ్లు తీసుకుని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో పెట్టి ప్రయోగం చేస్తాడు. అందులో మొదట ప్లాంట్ సెల్స్ కనిపించగా.. పోను పోను అసలు సీన్ బయట పడుతుంది. అందులో బ్యాక్టీరియా గుడ్లు, వార్మ్స్, తెలియని బ్యాక్టీరియా కనిపిస్తుంది. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్ అయింది.