Home > వైరల్ > అక్కడ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ను అద్దెకు ఇస్తరు.. కావాలంటే..!

అక్కడ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ను అద్దెకు ఇస్తరు.. కావాలంటే..!

అక్కడ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ను అద్దెకు ఇస్తరు.. కావాలంటే..!
X

ఈ కాలంలో ఎంత ఈజీగా ప్రేమలో పడుతున్నారో.. అంతకంటే ఈజీగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. దానికి తోడు ఫ్యామిలీ టెన్షన్స్, వర్క్ ప్రెజర్, ఒంటరి తనంతో విసిగిపోతున్నారు. దాంతో లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆ దేశం వాళ్లు ఓ సొల్యూషన్ కనుగొన్నారు. ఇళ్లు, వాహనాలు అద్దెకు ఇచ్చినట్లు.. స్ట్రెస్ లెవల్స్ తగ్గించేందుకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకు ఇస్తున్నారు. దానివల్ల యువతను కాపాడొచ్చని భావిస్తున్నారు.

జపాన్ లో ఈ రూల్ ను తీసుకొచ్చారు అధికారులు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ ను అద్దెకు ఇస్తూ.. ఆన్ లైన్ లో పోర్టల్ను తీసుకొచ్చారు. దీని ద్వారా దేశంలో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేనివాళ్లు.. ఒంటి తనాన్ని ఫీల్ అయ్యేవాళ్లెవరైనా.. వారిని గంటలపాటు అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకు గంటకు రూ.3 వేలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్ ట్రా క్వాలిటీస్ ఉన్నవాళ్లు కావాలంటే.. అదనంగా రూ. 1200 చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని రూల్స్ ను పాస్ చేసింది. ఆన్లైన్ పార్టనర్ ను బుక్ చేసుకునేవాళ్లు.. వాళ్లకు ఖరీదైన కానుకలు ఇచ్చే అవకాశం లేదని, కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు.

Updated : 17 July 2023 2:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top