Home > వైరల్ > జీపు బానెట్‌పై కూర్చుని యువతి ఓవరాక్షన్ ..తిక్క కుదిర్చిన పోలీసులు

జీపు బానెట్‌పై కూర్చుని యువతి ఓవరాక్షన్ ..తిక్క కుదిర్చిన పోలీసులు

జీపు బానెట్‌పై కూర్చుని యువతి ఓవరాక్షన్ ..తిక్క కుదిర్చిన పోలీసులు
X

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా రకరకాల సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది కంటెంట్ క్రియేటర్లు రకరకాల వేషాలు వేస్తున్నారు. రీల్స్ మైకంలో పడి అసలు ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం అన్న కామన్ సెన్స్ ను కోల్పోతున్నారు. తీవ్ర ఆందోళన కలిగించే విషయం. తమ ఫాలోవర్స్‎ను పెంచుకోవాలనే టార్గెట్‎తో వింతవింత ప్రయోగాలు చేస్తున్నారు. కొంత మంది చేసే వీడియోలకు మంచి ఆదరణ లభిస్తుంటే మరికొన్ని మాత్రం లేనిపోని చిక్కుల్లో చిక్కుకుంటున్నాయి. కొంత మంది తమ పిచ్చి వేషాలతో అడ్డంగా బుక్ అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యింది. 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారన్న ఆనందంలో యువతి చేసిని పనికి పోలీసులు రంగంలోకి అమె తిక్క కుదిర్చారు.

పంజాబ్‌లోని హోషియాపుర్‌‎కు చెందిన గౌరీ విర్ది అనే 25 ఏళ్ల యువతి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యింది. తన ఇన్‎స్టాగ్రామ్ అకౌంట్ రే 10 లక్షల మంది పాలోవర్స్ అయ్యారని ఈ యువతి వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవడమే ఆమె కొంప ముంచింది. ఆమె సంతోషాన్ని అందరికీ తెలపాలన్న ఉద్దేశంతో జలంధర్‌ - జమ్మూ జాతీయ హైవే మీద కారు బ్యనెట్‎పై కూర్చొని చేతిలో 1 మిలియన్ బెలూన్లను పట్టుకుని కారు కదులుతుండగానే డ్యాన్స్ చేసింది. తన డ్యాన్స్ వీడియోను యువతి తన అకౌంట్లో పోస్ట్ చేసింది. నెట్టింట్లో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసుల కంటికి చిక్కింది. దీంతో వీడియోలో కారు నంబరు ఆధారంగా యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాదండోయ్ కారును కూడా సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను యువతి అతిక్రమించినందుకు గాను ఆమెకు ఫైన్ కూడా వేశారు. యవతిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పంజాబ్ పోలీసులు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి పిచ్చి వేసాలు వేస్తే...చూస్తూ ఊరుకోమని పోలీసులుహెచ్చరికలు జారీ చేశారు.

Updated : 5 Aug 2023 8:57 AM IST
Tags:    
Next Story
Share it
Top