Home > వైరల్ > గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగాస్టార్ డాటర్ శ్రీజ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగాస్టార్ డాటర్ శ్రీజ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగాస్టార్ డాటర్ శ్రీజ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
X

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురిగా శ్రీజకు ఉన్న క్రేజ్ కంటే.. ఆమె తన పర్సనల్‌ లైఫ్‌లో జరిగిన పరిణామాలు, కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఫేమస్ అయింది. ప్రేమ వివాహం.. ఓ పాప(నివృతి)కి జన్మనివ్వడం, కొన్ని రోజులకే విడాకులు కావడం, మళ్లీ చిరు చెంతకు చేరడం.. ఆ తరువాత కొన్ని రోజులకు కళ్యాణ్ దేవ్‌తో రెండో పెళ్లి జరగడం, నవిష్క జన్మించడం అందరికీ తెలిసిందే. ఏం జరిగిందో ఏమో గానీ.. ఇప్పుడు ఆ రెండో వివాహం కూడా రద్దయిందని టాక్. శ్రీజ, కళ్యాణ్‌లు దూరంగానే ఉంటున్నారు. అధికారంగా విడిపోయినట్టుగా ప్రకటించలేదు గానీ వేర్వేరుగానే ఉంటున్నారు.

నవిష్కను వారానికి ఒకసారి కళ్యాణ్ వద్దకు పంపిస్తుంటుంది శ్రీజ. అలా వారంలో ఒకరోజు తన కూతురిని చూసుకుని కళ్యాణ్ దేవ్ మురిసిపోతోంటాడు. శ్రీజ ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనల నుంచి కోలుకోవడానికి స్నేహితులతో కలిసి వెకేషన్స్‌కి వెళ్తోంది, పార్టీలు చేసుకుంటోంది. తాజాగా శ్రీజ వేసిన ఓ పోస్ట్ అందరిలోనూ అనుమానాలను పుట్టిస్తోంది. సంథింగ్ ఈజ్ కమింగ్ అంటూ రాసుకొచ్చింది శ్రీజ. అంటే కొత్తగా ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతోందని అర్థం అవుతోంది. ఇక అంతే కాకుండా ఆ పోస్టులో కింద స్వాతి నిమ్మగడ్డ అనే పేరుని కూడా ట్యాగ్ చేసింది. అంటే ఈ ఇద్దరూ కలిసి ఏదో కొత్తగా స్టార్ట్ చేయబోతోన్నారనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తారా? లేక ఇంకేమైనా కొత్త విషయాన్ని చెబుతారా? అన్నది చూడాలి.

Updated : 3 Sept 2023 11:50 AM IST
Tags:    
Next Story
Share it
Top