వృద్ధుడి పైనుంచి వెళ్లిన రైలు.. తర్వాత ఏమైందంటే..?
X
బిహార్‌లో ఓ వృద్ధుడు పైనుంచి రైలు వెళ్లింది. గయా జిల్లా ఫతేపుర్ మండలంలోని మోర్‌హే గ్రామానికి చెందిన బాలో యాదవ్ పహాడ్‌పుర్ రైల్వేస్టేషనులో పట్టాలు దాటబోయాడు. ఇంతలో స్టేషనులో నిలిపి ఉన్న గూడ్స్ రైలు కదిలింది. దీంతో ఆ వృద్ధుడికి ఏంచేయాలో అర్ధం కాలేదు. ఇది గమనించిన ప్రయాణికులు అతడిని అలర్ట్ చేశారు. పట్టాలపై పడుకోమని కేకలు వేశారు. బాలో యాదవ్ వెంటనే పట్టాలపై పడుకోగా.. ఆయన పైనుంచి గూడ్స్ రైలు వెళ్లింది. ఏమాత్రం తడబాటు లేకుండా రైలు వెళ్లేదాక అలాగే ఉన్నాడు. ఆ తర్వాత కర్ర సాయంతో లేచి ఏమీ జరగనట్లు వెళ్లిపోయాడు. ఈ ఘటనలో అతడికి చిన్న గాయం కూడా కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా జూన్ 2న ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కోరమాండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టిన ఘటనలో 288 మంది మృతి చెందగా.. 1200 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రుల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరోవైపు ప్రమాదంపై అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. సిగ్నలింగ్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.