ఏనుగులతో సెల్ఫీ.. కట్ చేస్తే పరుగో పరుగు..వీడియో వైరల్
X
కొందరికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారదు. వన్య మృగాలు జోలికి వెళ్లొద్దని..వాటితో ఫోటోలు దిగొద్దిన చేసిన హెచ్చరికలు పట్టించుకోరు. జంతువులను దూరం నుంచి చూసి ఆనందించకుండా సెల్ఫీల మోజుతో ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అడవి ఏనుగులతో ఫోటోలకు ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు.
యూపీలోని దుధ్వా నేషనల్ పార్కులో ఏనుగుల గుంపు రోడ్డు దాటుతోంది. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు వాటితో సెల్ఫీలు తీసుకోవాలని భావించారు. అయితే ఏనుగులకు చిర్రెత్తింది. ఒక్కసారిగి ఆ ముగ్గురిని వెంబడించాయి. ప్రాణ భయంతో వారు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పడిపోయి..తిరిగి పరుగులు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారి తిక్క కుదిరింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
#UP के लखीमपुर खीरी जिले में #टस्कर हाथियों के झुंड के साथ सेल्फी लेना युवकों को को काफ़ी महंगा पड़ा 🙅 हाथियों के झुंड ने दौड़ाया,यूवको ने दौड़कर बमुश्किल हाथियों से बचाई अपनी जान 😢#वायरल_वीडियो पलिया तहसील के दुधवा टाइगर रिजर्व के पलिया गौरीफंटा मार्ग का है pic.twitter.com/P49c2v1lUo
— Dr.Ahtesham Siddiqui (@AhteshamFIN) July 4, 2023