Home > వైరల్ > తల్లి కోసం తాజ్మహల్ కట్టించాడు

తల్లి కోసం తాజ్మహల్ కట్టించాడు

తల్లి కోసం తాజ్మహల్ కట్టించాడు
X

లోకంలో తల్లి ప్రేమను మించింది లేదంటారు. ఎందుకంటే.. పిల్లల్ని తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని.. ఆ తర్వాత గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. కష్టాల్లో తోడుంటుంది. ఎదుగుదలను చూసి మురిసిపోతుంది. అందుకే దైవంతో సమానం అయిన అమ్మ రుణం.. ఏమిచ్చినా తీర్చుకోలేం అంటుంటారు. అందుకే తమిళనాడులోని అమరుద్దీన్ తన తల్లి కోసం తాజ్ మహల్ కట్టించాడు. అది ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ గా మారింది.

తమిళనాడులోని తిరువారూరు జిల్లా అమ్మైయప్పన్ ప్రాంతానికి చెందిన షేక్ దావూద్, జైలానీ బీవీ దంపతుల కుమారుడే అమరుద్దీన్. తన తండ్రి 20 ఏళ్ల క్రితం చనిపోగా.. పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచింది అమరుద్దిన్ తల్లి జైలానీ. తల్లి శ్రమను చూసిన అమరుద్దిన్ కష్టపడి చదివాడు. చెన్నైలో పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదిగాడు. అయితే, 2020లో జైలానీ చనిపోయింది. తల్లి మరణ వార్త విన్న అమరుద్దిన్ చలించిపోయాడు. కొన్నాళ్లకు ఆ షాక్ నుంచి తేరుకున్నాడు. తల్లి జ్ఞానపకంగా ఏదైనా చేయాలనుకున్నాడు.

అప్పటినుంచి తన కన్నవారి పేరు మీద సొంత ఊర్లో పేదలకు సాయం చేసేవాడు. అది కూడా తనకు తృప్తినీయలేదు. అప్పుడే కాట్టూర్‌ గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి.. తన తల్లికి స్మారక మందిరం నిర్మించిన విషయం గమనించాడు. అలాంటిదే తన తల్లిదండ్రులకు కట్టించాలని నిర్ణయించుకున్నాడు. తాజ్ మహల్ లాంటి నిర్మాణానికి డిజైన్ చేయించి.. రాజస్థాన్ నుంచి పాలరాతిని తెప్పించాడు. తాజ్ మహల్ లా తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని కట్టించాడు. ఇప్పుడా నిర్మాణం టూరిస్ట్ స్పాట్ లా మారింది. స్థానికులు, ఇరుగు పొరుగు గ్రామాల వాళ్లు దీన్ని చూడ్డానికి తరలివస్తున్నారు.

Updated : 10 Jun 2023 7:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top