Home > వైరల్ > టమాటా రేట్లు దిగి రావాలని ఆ గ్రామస్తులు ఏం చేశారో తెలుసా..?

టమాటా రేట్లు దిగి రావాలని ఆ గ్రామస్తులు ఏం చేశారో తెలుసా..?

టమాటా రేట్లు దిగి రావాలని ఆ గ్రామస్తులు ఏం చేశారో తెలుసా..?
X

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత నెల రోజులుగా రేట్లు సామాన్య ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. టమాటాను ముట్టుకోవాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. నిత్యం వంటకాలలో వినియోగించే టమాటా ధరల కారణంగా దూరం అవుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది పెరిగిన ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తుంటే మరికొందరు మాత్రం దేవుడి మీద భారం వేస్తూ ధరలు తగ్గించాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయ్యా దేవుడా టమాటా టమాట ధరలు తిరిగి పూర్వ స్థితికి తీసుకువచ్చేలా చెయ్యవయ్యా అంటూ అమాయకంగా వేడుకుంటున్నారు.

టమాటా ధరలు దిగి రావాలని తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కరుకుడి గ్రామస్తులు తమ గ్రామ దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. అడిమాస పౌర్ణమి సందర్భంగా శ్రీ మరియమ్మన్‌, నాగమ్మన్‌ దేవాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే టమాటా రేట్లు తగ్గాలని దేవుళ్లకు 508 టమాటాలతో దండగుచ్చి మరి అలంకరించారు.

tamilnadu people special prayers to goddes. To reduce tomato rates

Tamilnadu, Tomato, Tomato Price, tomato garland, special prayers, 508 tomatos, natinal news,

Updated : 4 Aug 2023 5:58 PM IST
Next Story
Share it
Top