Home > వైరల్ > 9 ఏండ్లకు టెన్త్.. 22ఏండ్లకు ఐఐటీ ప్రొఫెసర్..

9 ఏండ్లకు టెన్త్.. 22ఏండ్లకు ఐఐటీ ప్రొఫెసర్..

9 ఏండ్లకు టెన్త్.. 22ఏండ్లకు ఐఐటీ ప్రొఫెసర్..
X

తథాగత్ అవతార్ తులసి. దేశంలోనే అతి చిన్న వయసులో పీహెచ్డీ పూర్తి చేసిన మేధావి. 1987 సెప్టెంబర్ 9న బీహార్లో జన్మించిన తథాగత్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. అందుకే 9ఏండ్ల వయసులోనే టెన్త్ కంప్లీట్ చేశాడు. 11 ఏండ్లకు బీఎస్సీ, 12వ ఏట పాట్నా సైన్స్ కాలేజీ నుంచి ఎమ్మెస్సీ కంప్లీట్ చేశాడు. పీజీ పూర్తైన తర్వాత 21 ఏండ్లకే తథాగత్ 2009లో ఐఐటీ బెంగళూరు నుంచి పీహెచ్డీ పూర్తి చేశాడు.

తథాగత్ టాలెంట్ గుర్తించిన ఐఐటీ బాంబే యాజమాన్యం 2010 జులైలో జాబ్ ఆఫర్ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఇచ్చింది. అయితే 2019లో ఊహించని విధంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. అనారోగ్యం కారణంగా తథాగత్ లాంగ్ లీవ్ తీసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఐటీ బాంబే ప్రకటించింది. ఈ నిర్ణయంపై తథాగత్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.

2001లో జర్మనీలో నిర్వహించిన నోబెల్ గ్రహీతల సమావేశంలో పాల్గొనే వ్యక్తుల లిస్టులో భారత ప్రభుత్వం తథాగత్ పేరు చేర్చింది. అప్పటికి అతని వయసు 14ఏండ్లు. జనరలైజేషన్ ఆఫ్ క్వాంటమ్ రీసెర్చ్ ఆల్గారిథమ్ ను పీహెచ్డీ థీసిస్ గా ఎంచుకున్నాడు. గిఫ్టెడ్ ఏషియన్ యంగ్స్టర్స్ పేరుతో టైమ్ మ్యాగజైన్ తథాగత్ పై కథనం ప్రచురించింది. టైమ్స్ పత్రిక ఫిజిక్స్ ప్రోడగి అని ప్రశంసించింది. ది వీక్ పత్రిక సైతం మాస్టర్ మైండ్ పేరుతో ఆర్టికల్ రాసింది. మై బ్రిలియంట్ బ్రెయిన్ పేరుతో 2007 డిసెంబర్ 13న నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ తథాగత్ పై స్పెషల్ ప్రోగ్రాం ప్రసారం చేసింది.

Tathagat Avatar Tulsi who completed PhD at 21 from IISC became IIT professor at 22

national,bihar,Tathagat Avatar Tulsi,PhD,IISC,IIT professor,bsc,patna science college,msc,iit banglore,iit bombay,contract job,assistant professor,long leave,germany,Nobel laureates conference,Generalizations of the Quantum Search Algorithm,gifted Asian youngsters,TIME magazine,National Geographic Channel

Updated : 31 Aug 2023 5:16 PM GMT
Tags:    
Next Story
Share it
Top