Home > వైరల్ > కదులుతున్న ట్రైన్ ఎక్కబోయిన టీసీ.. అంతలోనే..

కదులుతున్న ట్రైన్ ఎక్కబోయిన టీసీ.. అంతలోనే..

కదులుతున్న ట్రైన్ ఎక్కబోయిన టీసీ.. అంతలోనే..
X

ఓ రైల్వే టీసీకి తృటిలో ప్రమాదం తప్పింది. తాను విధులు నిర్వహించే ట్రైన్ కిందే పడబోయి.. కొంచెంలో మిస్సయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అహ్మదాబాద్‌ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్‌ రైలు.. ప్లాట్‌ఫాం నుంచి అప్పుడే కదులుతోంది. ఇంతలో అదే రైల్లో విధులు నిర్వహించాల్సిన టీసీ పరుగెత్తుకుంటూ ట్రైన్ దగ్గరకు వచ్చాడు. కానీ రైలు క్రమంగా వేగం పుంజుకోవడంతో ఎక్కేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు.

ఆ తర్వాత రైలును ఆపాలని లోకోపైలట్‌కు సైగ చేస్తూ దాని వెంట పరుగెత్తాడు. అప్పటికే సగం డోర్లు మూసుకపోయాయి. మరోవైపు ప్లాట్‌ఫామ్ తడిగా ఉండటంతో అదుపుతప్పి జారిపడిపోయాడు. దీనిని గమనించిన అక్కడున్న వారు అప్రమత్తమై టీసీని పక్కకు లాగేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. జూన్‌ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఒకే రైల్లో వెళ్లాల్సిన టీసీ, లోకో పైలట్ మధ్య ఎందుకు సమన్వయం లేదు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీసీ అదృష్టవంతుడు అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Updated : 1 July 2023 2:13 PM IST
Tags:    
Next Story
Share it
Top