Home > వైరల్ > అమెరికాలో టీడీపీ శ్రేణుల మధ్య ఫైట్ ?...వీడియో వైరల్

అమెరికాలో టీడీపీ శ్రేణుల మధ్య ఫైట్ ?...వీడియో వైరల్

అమెరికాలో టీడీపీ శ్రేణుల మధ్య ఫైట్ ?...వీడియో వైరల్
X

అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో టీడీపీ ఎన్ఆర్ఐ తెలుగు తమ్ముళ్లు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు పరస్పర దాడులకు దిగినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను వైసీపీ షేర్ చేసింది. కొందరు తెలుగు తమ్ముళ్లు జై ఎన్టీఆర్ అంటూ నినాదం చేశారని, దీంతో ఆగ్రహించిన లోకేశ్ అభిమానులు వారిపై దాడికి దిగారని వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పర దాడులకు పాల్పడుతూ పిడిగుద్దులు గుద్దుకున్నారని తెలిపింది. టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ గొడవ జరిగినట్లు వెల్లడించింది. అయితే గొడవకు కారణం తెలియకపోయినా వారు ఘర్షణపడ్డ వీడియోలు మాత్రం బయటకు వచ్చాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. ఈ అంశంపై టీడీపీ స్పందించాల్సి ఉంది.


Updated : 9 July 2023 3:45 PM IST
Tags:    
Next Story
Share it
Top