Home > వైరల్ > టీ కప్పు విలువ రూ.24 కోట్లు..ప్రత్యేకతలివే..

టీ కప్పు విలువ రూ.24 కోట్లు..ప్రత్యేకతలివే..

టీ కప్పు విలువ రూ.24 కోట్లు..ప్రత్యేకతలివే..
X

భారతదేశం అంతటా అత్యంత ఇష్టపడే పానీయాలలో టీ ఒకటి. ఉదయం లేవగానే మంచి టీ లేదా కాఫీ పొట్టలో పడకపోతే మనలో చాలా మందికి అసలు రోజు మొదలుకాదు. మైండ్ రిలీఫ్ కోసం ఈ టీని గ్లాసులు, కప్పులు వంటి వాటిలో తాగుతారు. ముఖ్యంగా స్టెయిన్ లెస్ స్టీల్ లాంటి పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎవరు స్తోమతను బట్టి టీ తాగే సాసర్, కప్పు ఖరీదు ఉంటుంది. అసలు ప్రపంచంలో అంత ఖరీదైన టీ కప్పు ధర ? దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచంలోనే అత్యంత విలువైన టీపాట్ ధర అక్షరాల రూ.24 కోట్లు. ఇగోయిస్ట్ గా పిలవబడే ఈ టీకప్పును ఎన్ సేతియా ఫౌండేషన్, న్యూబీ టీస్ ఆఫ్ లండన్ సహకారంతో రూపొందించారు. ఇటాలియన్ జ్యుయలర్ ఫుల్వియో స్కావియా దీన్ని తయారు చేశారు.2016లో ప్రపంచ రికార్డు అందుకుంది.

ఈ టీ కప్పులో మొత్తం 1658 వజ్రాలు పొదిగించబడ్డాయి. 18 క్యారెట్ల బంగారం మరియు బంగారు పూతతో కూడిన వెండి భాగాలు, 386 థాయ్, బర్మీస్ రూబీలను

దీని కోసం ఉపయోగించారు. ఈ వివరాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ట్విట్టర్ పేజీలో ఈ నెల 9న పోస్ట్ చేసింది.

Updated : 11 Aug 2023 3:36 PM IST
Tags:    
Next Story
Share it
Top