ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో రన్ వే మీద దొర్లిన విమానం
X
బెంగళూరులోని ఓ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు కానీ ల్యాండ్ అయినప్పుడు రన్ వే మీద నీళ్ళు ఉండడంతో విమానం కాస్తా దొర్లుకుంటూ వెళ్ళింది. ఇంకేముంది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం వలన వెంటనే వెనక్కు రావలసి వచ్చింది. హాల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ విమానం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వెళుతోంది. అయితే టేకాఫ్ అయిన తర్వాత ముందు వైపున్న నోస్ ల్యాండింగ్ గేర్ రీట్రాక్ట్ అవ్వలేదు. దీంతో విమానాన్ని వెనక్కి తిప్పారు. అంతేకాదు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా చేయాల్సి వచ్చింది. అయితే దిగుతున్నప్పుడు ఫ్లైట్ రన్ వే మీద అదుపుతప్పింది. అదే సమయానికి రన్ వే మీద నీళ్ళు ఉన్నాయి. అసలే నోస్ ల్యాండింగ్ గేర్ సరిగ్గా లేదు, దానికి తోడు నీళ్ళు...దీంతో విమానం ముందుకు దొర్లుకుంటూ వెళ్ళింది. ఫ్లైట్ ముందు భాగం నేలకు తాకింది.
ఏది ఏమైనా ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయింది చివరకు. ఎవరకూ ఏమీ కాలేదు. ఇందులో పైలెట్లు మాత్రమే కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు లేరు కూడా. కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Extremely well executed wheel in abnormal position landing
— Dr MJ Augustine Vinod 🇮🇳 (@mjavinod) July 11, 2023
At Bangalore HAL airport, today pic.twitter.com/XoOHn9tDkg