రూ.80 బిర్యానీ కోసం వెళ్తే... రూ.4 లక్షలు పోయాయి..వీడియో వైరల్
X
మీ వాహనాలు రోడ్డుపై నిలిపివేసి పక్కకు వెళ్తున్నారా ? బైక్, కారు డిక్కీలలో విలువైన వస్తువులు, నగదు ఉంచుతున్నారా ?
అయితే మీరు వచ్చేసరికి మీ వస్తువులు మాయమైపోవచ్చు.సెకెన్ల వ్యవధిలోనే అంతా జరిగిపోతోంది. ఏమీ వదలరు సర్వం దోచేస్తారు. తాజాగా భీమవరంలో ఇదే జరిగింది. రూ.80 బిర్యానీ తింటామని వెళ్తే రూ.4 లక్షలు పోయాయి.
అది భీమవరంలోని రద్దీగా ఉండే ప్రదేశం. వాహనదారులు, స్థానికులు నిత్యం తిరుగుతూనే ఉంటారు. అక్కడ సీతయ్య హోటల్ ఉంది. ఇద్దరు యువకులు బిర్యానీ తిందామని వచ్చి వారీ స్కూటీ బయటపెట్టి హోటల్‌లోకి వెళ్లారు. ఇంతలో మాస్క్ పెట్టుకొని వచ్చిన ఓ వ్యక్తి డిక్కీలో ఉన్న 4 లక్షల రూపాయలను చోరీ చేశాడు. చాకచక్యంగా ఢిక్కీ తెరిచి దానిలోని డబ్బుతో ఉడాయించాడు. ప్రస్తుతం దొంగతనం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చోరికి గురైన నగదు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిదిగా గుర్తించారు. తన కుర్రాళ్లకు రూ.4 లక్షలు ఇచ్చి బ్యాంకులో వేయమని చెప్పగా బ్యాంక్ టైం అయిపోవడంతో బిర్యాని తినటానికి బైకు బయట ఆపి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు బైకు డిక్కీలోని సొమ్మును అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. సిసిటీవి ఫుటేజీ ఆధారంగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
భీమవరంలో 80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2023
భీమవరం పట్టణంలోని సీతయ్య హోటల్ వద్ద స్కూటీ డిక్కీలో ఉన్న 4 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకు పోయారు.
పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తన కుర్రాళ్లకు రూ.4 లక్షలు ఇచ్చి బ్యాంకులో వేయమని చెప్పగా బ్యాంక్ టైం… pic.twitter.com/ZVaonbROj2