Home > వైరల్ > టమాటాల లోడ్తో వెళ్తున్న వాహనం చోరీ.. ఆందోళనలో రైతు

టమాటాల లోడ్తో వెళ్తున్న వాహనం చోరీ.. ఆందోళనలో రైతు

టమాటాల లోడ్తో వెళ్తున్న వాహనం చోరీ.. ఆందోళనలో రైతు
X

టమాటాలు ఇప్పుడు బంగారంగా మారాయి. వాటి ధర వింటేనే సామాన్యుడి గుండెలు అదురుతున్నాయి. అంతలా భయపెడుతున్నాయి టమాటాల ధరలు. ప్రస్తుతం టామాటాల రేట్లు కేజీ 150కి పైగా ఉంది. మరికొన్ని చోట్లా అంతకుమించే ఉండడంతో గతంలో కేజీలకు కేజీలు కొన్న జనం ఇప్పుడు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. టమాట ధరలు పెరగడంతో పలుచోట్లు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

ఇప్పటికే ఓ చోట పొలంలో ఉన్న టమాటాలన్నింటినీ దుండగులు ఎత్తుకపోగా.. అటువంటిదో మరో ఘటన కర్నాటకలో జరిగింది. ఈ సారి టమాటాలు తీసుకెళ్తున్న వాహనాన్నే చోరీ చేయడం గమనార్హం. బెంగళూరులోని చిక్కజాల గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ రైతు బొలేరో వాహనంలో హిరియూరు నుంచి కోలార్‌ మార్కెట్కు టమాట రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు కారులో టమాటాలతో ఉన్న బొలెరో వాహనాన్ని అనుసరించారు.

ఆర్‌ఎంసీయార్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. తమ కారును బొలేరో వాహనం స్వల్పంగా ఢీకొట్టిందంటూ రైతు సహా డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ తర్వాత కారు డ్యామేజ్ అయ్యిందని.. డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకునే టైంలో వాహనంలోని టమాటాలు చూశారు. దీంతో రైతు, డ్రైవర్ ను వదిలేసి టమాటాలతో ఉన్న బొలేరో వాహనాన్ని తీసుకొని వెళ్లారు. 2వేల కిలోల టమాటాలు చోరీ అవడంతో రైతు లబోదిబోమంటున్నారు. రైతు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Updated : 10 July 2023 5:59 PM IST
Tags:    
Next Story
Share it
Top