బండ్లగూడ యాక్సిడెంట్‌పై ..సజ్జనార్ ట్వీట్ వైరల్
X
హైదరబాద్ నగర శివారులోని బండ్లగూడ జాగీర్ సన్‌సిటీ దగ్గర మంగళవారం ఉదయం ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ముగ్గురిని మింగేసింది. అత్యంత విషాధకరమైన ఈ దుర్ఘటన నగరంలో సంచలనంగా మారింది. తాజాగా ఈ యాక్సిడెంట్పైన టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ సంఘటన
అత్యంత దురదృష్టకరమని ట్విటర్ వేదికగా ఆయన తెలిపారు.
‘‘ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన అతివేగం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన అమాయకులైన తల్లీకూతురిని పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. పిల్లల మీద అతిప్రేమతో వాహనాలిచ్చి రోడ్లపైకి పంపితే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయి’’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా సజ్జనార్ ట్వీట్‌కు తమదైన రీతిలో రిప్లైలు ఇస్తున్నారు.
నగర శివారులోని బండ్లగూడ జాగీర్ సన్‌సిటీ దగ్గర రహదారి పక్కన వాకింగ్ చేస్తున్న ముగురిని... దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో హైదర్‌షాకోట్‌లోని లక్ష్మీనరసింహ కాలనీలో నివసిస్తున్న నెమలి అనురాధ, ఆమె కూతురు మమత సహా, కవిత అనే మహిళ 10 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో అనురాధ, మమతలు అక్కడికక్కడే మరణించారు. కవితతో సహా ఆలంఖాన్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరికీ అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ శివారులోని సన్ సిటీ దగ్గర నిన్న జరిగిన ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం. ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన అతివేగం.. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన అమాయకులైన తల్లీకూతురిని పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకటికి… pic.twitter.com/4TgJDxH5Ym
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 5, 2023