Home > వైరల్ > అమ్మవారికి మొక్కు.. టమాటాలతో తులాభారం

అమ్మవారికి మొక్కు.. టమాటాలతో తులాభారం

అమ్మవారికి మొక్కు.. టమాటాలతో తులాభారం
X

సాధారణంగా ఆలయాల్లో మొక్కులు తీర్చుకునే వాళ్లు.. బెల్లంతోనో, పంచదారతోనో, లేదా నాణేలతోనో తులాభారం వేస్తుంటారు. ఆ నిలువెత్తు సొత్తుని దేవుడికి సమర్పిస్తారు. అది ఆనవాయితీ. కానీ ఇది ఓ అరుదైన తులాభారం. తమ కుమార్తెకు నిలువెత్తు టమాటాలతో తులాభారం వేశారు తల్లిదండ్రులు. ఆ టమోటాలను ఆలయానికి సమర్పించారు. ఆలయంలో జరిగే నిత్యాన్నదానంలో వాటిని వినియోగించాలని చెప్పారు.

ఏపీలోని అనకాపల్లి జిల్లాకు చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతులు.. తమ కూతురు భవిష్యకు టమాటా తులాభారం నిర్వహించారు. నూకాలమ్మ ఆలయంలో ఈ మొక్కుబడి కార్యక్రమం నిర్వహించారు. తమ కుమార్తె తరపున నిలువెత్తు బంగారం(బెల్లం) ఇస్తామని అమ్మవారికి మొక్కుకున్న తల్లిదండ్రులు.. తొలుత 51 కేజీల టమాటాలతో తులాభారం ఇచ్చారు. తర్వాత బెల్లం, పంచదారతో నిర్వహించారు. తులాభారం కింద వచ్చిన టమాట, బెల్లం, పంచదారలను అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగించారు. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటాల ధర కేజీ రూ.120పైనే ఉంది. దీంతో తులాభారం నిర్వహించే సమయంలో దర్శనానికి వచ్చిన భక్తులు ఆస్తక్తిగా తిలకించారు.

ప్రస్తుత రోజుల్లో.. టామాటాలకు ఎంత విలువుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టామాటాలు అమ్మిన రైతులు కోటీశ్వరులవుతున్నారు. టమాటాలపై జోకులు, మీమ్స్ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వైరల్ అవుతున్నాయి. ఇక టమాటా దొంగల గురించి, వాటిని కాపాడుకోడానికి పెడుతున్న సెక్యూరిటీ గురించి చెప్పక్కర్లేదు. టమాటాలు కిందపడిపోయినా, టమాటా వాహనాలకు ప్రమాదం జరిగినా.. మీడియాలో హైలెట్ అవుతోంది. ఇప్పుడీ టమాటా తులాభారం కూడా అలాగే వైరల్ గా మారింది.

Updated : 17 July 2023 9:40 AM IST
Tags:    
Next Story
Share it
Top