Guinness World Record : కూతురిపై ఇతడికి ఉన్న ప్రేమ.. ప్రపంచంలో ఇంకెవరికి ఉండదేమో...
X
తండ్రికి కూతుళ్లు అంటే మస్త్ ప్రేమ ఉంటది. ఎందరు కొడుకులు ఉన్నా కూతురంటేనే నాన్నకు మహాఇష్టం. తాజాగా ఓ తండ్రి కూతురిపై ప్రేమను చాటిచెప్పి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. గతంలో తాను సృష్టించిన ప్రపంచ రికార్డును తిరగరాశాడు. బ్రిటన్కు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్కు లూసీ అనే ఏడేళ్ల కూతురు ఉంది. కూతురిపై ప్రేమను ప్రపంచానికి చాటాలని నిశ్చయించుకున్నాడు. లూసీ పేరు మీద 667 పచ్చబొట్లు వేయించుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు.
2017లో ఎవాన్స్ తన కూతురు పేరును శరీరంపై 267 సార్లు టాటూ వేయించుకున్నాడు. అది ప్రపంచ రికార్డుగా నమోదైంది. కానీ అమెరికాకు చెందిన డెడ్రా విజిల్ ఈ రికార్డును చెరిపేశారు. తన పేరును 300 సార్లు పచ్చబొట్టుగా వేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో తన కూతురి పేరును మరో 400 సార్లు టాటూ వేయించుకుని ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. గతంలో ఎవాన్స్ తన వీపు భాగంలో కూతురు పేరును రాయించుకోగా.. ఈ సారి రెండు కాళ్ల తొడలపై పచ్చబొట్లు వేయించుకున్నాడు.
శరీరంపై ఒకే పేరును అధిక సంఖ్యలో కలిగి ఉన్న వ్యక్తిగా ఎవాన్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.‘‘నా రికార్డు నాతోపాటే ఎక్కడికి వెళ్లినా వస్తుంది’’ అని ఎవాన్స్ అన్నారు. గతంలో తన కూతురు సంరక్షణ కోసం డబ్బులు సేకరించేందుకు ఎవాన్స్ పచ్చబొట్లు వేయించుకోవాలని అనుకున్నాడు. ముందు 100 సార్లు అనుకోగా టాటూ ఆర్టిస్ట్ 267 సార్లు లూసీ పేరుతో టాటూ వేశాడు.