Home > వైరల్ > స్కూల్లో ముస్లిం విద్యార్థికి చెంప దెబ్బలు.. దేశమంతా రచ్చ

స్కూల్లో ముస్లిం విద్యార్థికి చెంప దెబ్బలు.. దేశమంతా రచ్చ

స్కూల్లో ముస్లిం విద్యార్థికి చెంప దెబ్బలు.. దేశమంతా రచ్చ
X


ఆమె ఓ టీచర్. కులమతాలకు అతీతంగా విద్యార్థులను సమానంగా చూడాలి. కానీ ఆమె అలా చేయలేదు. గురువు స్థానంలో ఉండి మతవివక్ష ప్రదర్శించారు. ముస్లిం విద్యార్థిని వేరే విద్యార్థులతో కొట్టించారు. చెంపపై కొట్టండి, నడుము దగ్గర కొట్టండి అంటూ పసి మనస్సులను రెచ్చగొట్టింది. తోటి స్నేహితులతో అతడిని కొట్టించిన వీడియో వైరల్ కావడంతో ఆమెపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.

ముజఫర్‌నగర్‌ ఖుబ్బాపూర్ గ్రామంలోని నేహా పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ముస్లిం విద్యార్థి హోం వర్క్ చేయలేదని టీచర్ క్లాస్ రూంలోని తోటి విద్యార్థులతో కొట్టించింది. గట్టిగా కొట్టండి, చెంపపై, నడుముపై కొట్టాలంటూ విద్యార్థులను రెచ్చగొట్టింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. సదరు టీచర్పై నెటిజన్లు మండిపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై స్పందించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆ వీడియోను ఎడిట్ చేశారని టీచర్ చెబుతున్నారు. ‘‘నేను వికలాంగురాలిని. ఆ పిల్లాడి తల్లిదండ్రుల నుంచి నాకు ఒత్తిడి ఉంది. ఆ విద్యార్థి హోం వర్క్ చేయలేదు. హోం వర్క్ చేయాలని ఇతర విద్యార్థులతో చెంపపై కొట్టించాను’’ అని చెప్పారు. తన కుమారుడిని స్కూలు నుంచి తీసుకొచ్చినట్లు తండ్రి తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయకుండా స్కూలు యాజమాన్యం తనతో అగ్రిమెంటు చేసుకుందని చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా అడ్మిషన్ ఫీజు మొత్తం వెనక్కి ఇచ్చారన్నారు.

Updated : 26 Aug 2023 7:51 PM IST
Tags:    
Next Story
Share it
Top