Home > వైరల్ > వీడియోలతో కోటి ఆదాయం.. యూట్యూబర్ ఇంట్లో ఐటీ సోదాలు..!

వీడియోలతో కోటి ఆదాయం.. యూట్యూబర్ ఇంట్లో ఐటీ సోదాలు..!

వీడియోలతో కోటి ఆదాయం.. యూట్యూబర్ ఇంట్లో ఐటీ సోదాలు..!
X

ప్రస్తుతం యూట్యూబ్ ఓ ఆదాయ వనరుగా మారింది. యువత యూట్యూబ్‌ను కెరీర్‌గా ఎంచుకుని రాణిస్తున్నారు. ఊహించన విధంగా డబ్బును సంపాదిస్తున్నారు. లక్షలు, కోట్లలో.. ఫేమస్ యూట్యూబర్స్ ఇన్‎కమ్ ఉంటుంది. అయితే వారిలో కొందరు సరిగ్గా పన్నులు కట్టకపోవడంపై ఐటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ యూట్యూబర్స్‌పై దాడులు చేశారు. గత నెలలో కేరళలో పేరుగాంచిన 10 మంది యూట్యూబర్స్ నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. తాజాగా యూపీలోని మరో యూట్యూబర్ నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.

యూట్యూబ్ ద్వారా రూ.కోటి వరకు సంపాదించిన తస్లీమ్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. అతని నివాసంలో రూ. 24 లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే ఆరోపణలు నేపథ్యంలో అతడి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.

గత కొన్నేళ్లుగా తస్లీమ్ యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నాడు. 'ట్రేడింగ్ హబ్ 3.0' ద్వారా షేర్ మార్కెట్ సంబంధిత వీడియోలను చేస్తుంటాడు. అవి బాగా క్లిక్ కావడంతో భారీగా ఆదాయం వస్తోంది. దీంతో అధికారులు తస్లీమ్ ఆదాయంపై దృష్టి సారించారు.

ఐటీ సోదాలపై తస్లీమ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తస్లీమ్ ఎలాంటి తప్పులు చేయలేదని అతడి తమ్ముడు తెలిపాడు. సంపాదనపై వచ్చే ఆదాయానికి ట్యాక్స్ కూడా కడుతున్నాడని..యూట్యూబ్ ద్వారా వచ్చిన రూ. 1.2 కోట్ల ఆదాయానికి ఇప్పటికే రూ. 4 లక్షల పన్ను కట్టామని వివరించాడు. కేవలం కుట్రతోనే తమ నివాసంలో దాడులు జరిగాయని ఆరోపించాడు. ఈ దాడులపై తస్లీమ్‌ తల్లి కూడా స్పందించారు. తన కుమారుడిని కావాలనే కేసులో ఇరికిస్తున్నారన్నారు.


Updated : 17 July 2023 4:57 PM IST
Tags:    
Next Story
Share it
Top