Home > వైరల్ > అచ్చోసిన ఆంబోతు టెర్రర్ ఇలా ఉంటది.. వీడియో

అచ్చోసిన ఆంబోతు టెర్రర్ ఇలా ఉంటది.. వీడియో

అచ్చోసిన ఆంబోతు టెర్రర్ ఇలా ఉంటది.. వీడియో
X

అచ్చోసిన ఆంబోతు కొన్ని గ్రామాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటివరకు అది పన్నెండు మందిని కుమ్మి తీవ్రగా గాయపరించింది. ఓ రైతు త్రుటిలో ప్రాణగండం తప్పించుకున్నాడు. దాని ధాటికి జడిసి మరో దారిలేక చెట్టెక్కి రెండు గంటలకుపైగా అక్కడే ఉన్నాడు. అది కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రెండు గంటలపాటు చెట్టుకిందే రంకెవేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా రస్దా బ్లాకులో ఓ ఎద్దు బీభత్సం ఇది. ఎక్కడి నుంచో వచ్చిన వృషభం కొన్ని రోజుగా జనంపై పగబట్టినట్టు దాడి చేస్తోంది. పలు గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ 12 మంది రక్తాన్ని కళ్లజూసింది. శుక్రవారం రస్దా శివారులో ఖక్నూ అనే రైతును వెంబడించింది. అతడు ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్టు ఎక్కాడు. ఎద్దు అప్పటికీ అతణ్ని వదలకుండా పక్కనే కాలు దువ్వుతూ కాపు కాసింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. దాని దృష్టి మళ్లించి మత్తుమందు ప్రయోగించి అదుపులోకి తీసుకునే ఆపరేషన్ ప్రారంభించారు. రాష్ట్రంలో అచ్చోసిన ఆంబోతులు పెరిగిపోతున్నాయని వాటిని నియంత్రించడానికి ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేయాలని విపక్ష నేత అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.

Updated : 31 July 2023 11:06 AM IST
Tags:    
Next Story
Share it
Top