Home > వైరల్ > రోజురోజుకూ పెరుగిపోతున్న కూరగాయల ధరలు

రోజురోజుకూ పెరుగిపోతున్న కూరగాయల ధరలు

రోజురోజుకూ పెరుగిపోతున్న కూరగాయల ధరలు
X

సోషల్ మీడియాలో వెజ్, నాన్ వెజ్ అంటూ రచ్చ జరుగుతోంది కానీ ఒక్కసారి అలా బజార్లోకి వెళ్ళి కూరగాయలు ధరలు చూస్తే...బాబోయ్ వెజ్ వద్దు, నాన్ వెజ్జే ముద్దు అంటారు. రోజురోజుకూ కూరగాయలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉన్న పంటలు పోయాయి. పోనీ దిగుమతి చేసుకుందామా అంటే ఆ వీలు కూడా లేకుండా పోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 500 రూపాయలు పెడితే వారానికి సరిపడా కూరలు రావడం లేదంటే అందులో విచిత్రమేమీ లేదు.

ఉన్న సరుకునే వ్యాపారులు బ్లాక్ చేసి అమ్ముతుననారు. దీంతో అన్నీ డబుల్ రేట్లు అయి కూర్చున్నాయి. టమాటాలు ఒక్కటే కాదు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అన్నీ ధరలు మండుతున్నాయి. టమాటా అయితే డబుల్ సెంచురీ కొట్టేసింది. మదనపల్లి మార్కెట్లో ఇవాళ టమాటా రేటు 225రూపాయలు పలుకుతోంది. ఈ పెరుగుదల మధ్య తరగతి, సామాన్య ప్రజల మీద చాలా ప్రభావం చూపిస్తోంది. వాళ్ళ మీద ఆర్ధిక భారం పడుతోంది.

కూరలు ధరలు పెరుగుతుంటే...చికెన్ ధర మాత్రం తగ్గుతోంది. టమాటల కంటే చికెన్ రేటే తక్కువ ఉంది చాలా చోట్ల. కేజీ చికెన్ ధర 200 రూ. లుగా ఉంది. దీంతో వెజ్ తినే బదులు నాన్ వెజ్ తింటేనే మంచిది అంటున్నారు.

వర్షాలకారణంగా రోజూ కూలీలకు పనులు దొరకడం లేదు. మరోవైపు కూరగాయలతో పాటూ నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోవడంతో ఏం తినాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు. ఎప్పటికి పరిస్థితి మామూలుకు వస్తుందో అని బెంగపడుతున్నారు.

Updated : 2 Aug 2023 12:53 PM IST
Tags:    
Next Story
Share it
Top