చాక్లెట్లతో జడ..పెళ్లి కూతురి ఐడియా అదిరిపోలా!
X
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మరుపురాని వేడుక. అందుకే నూతన వధూవరులు తమ పెళ్లి రోజున స్పెషల్‌గా కనిపించాలని , వారి లైఫ్‌లో పెళ్లి మధురజ్ఞాపకంగా గుర్తుండిపోవాలని భావిస్తుంటారు. అందుకే ఈ మధ్యకాలంలో పెళ్లిని ఓ పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లని, ప్రీ వెడ్డింగ్ షూట్లని నానా హంగామా చేస్తున్నారు. ఈ వేడుకల్లో వధూవరులు కూడా తమను తాము కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యనే ఓ వధువు తన పెళ్లి కోసం డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. పూలతో అయితే రొటీన్‌గా అందరు పెళ్లి కూతుర్లు జెడ వేసుకుంటారు కానీ, ఈ వధువు మాత్రం వెరైటీ గా చాక్లెట్లతో జడ అల్లేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
పెళ్లిలో పెళ్లి కూతురికి ఉండే అలంకరణలు ,పెళ్లి కొడుక్కు ఉండవు. పెళ్లి సమయం రాగానే హెయిర్ స్టైల్ దగ్గరి నుంచి మేకప్, మెహందీ వరకు పెళ్లి సందర్భంగా జరిగే ప్రతి తంతులో పెళ్లి కూతురు స్పెషల్ గా కనిపించేందకు ట్రైచేస్తుంటుంది. అందుకే ఈ పెళ్లి కూతురు కూడా ముచ్చటపడి మరీ క్రియేటివ్‌గా ఆలోచించి ఈ చాక్లెట్ జడను వేయించుకుంది. అటు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే ఇలా వినూత్నంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా పెళ్లిలో వధువుకి పూలజడ వేస్తుంటారు. రకరకాల రంగుల పూలను అమర్చి జడను ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. పూలతో జడ ఎంతో బోర్ అని అనుకుందేమో కాబోలు ఈ పెళ్లి కూతురు ఇలా చాక్లెట్ల జడతో అందరి నోరూరిస్తోంది.