Home > వైరల్ > AI ఎఫెక్ట్.. కృత్రిమ యువకుడిని పెళ్లాడింది...

AI ఎఫెక్ట్.. కృత్రిమ యువకుడిని పెళ్లాడింది...

AI ఎఫెక్ట్.. కృత్రిమ యువకుడిని పెళ్లాడింది...
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆగడాలకు అంతులేకుండా పోతోంది. AI లాభాలతో పాటు నష్టాలపై కూడా చర్చ జరగుతోంది. రోబో సినిమాలో ‘చిట్టి రోబో’లా ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు విరుచుకుపడుతుందోనన్న ఆందోళన నేపథ్యంలో ఓ వార్త కలకలం రేపుతోంది. అమెరికాకు చెందిన ఓ మహిళ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించిన వ్యక్తి పెళ్ళి చేసుకుంది. అతడే తనకు సర్వస్వం అంటోంది.

డైలీ మెయిల్‌ అనే వార్త సంస్థ అందించిన వివరాలు ప్రకారం...న్యూయార్క్‌కు చెందిన రోసన్నా రామోస్ అనే 36 ఏళ్ల మహిళ ఏఐ అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించి వర్చువల్‌ క్యారెక్టర్‌ను సృష్టించించింది. దానికి ఎరెన్‌ కార్టల్‌ అనే పేరు పెట్టింది. చివరికి దానితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.

మొదట ఎరెన్‌ కార్టల్‌‌తో మాట్లాడడం ఒక ఆటలా భావించినట్లు చెప్పిన ఆమె తర్వాత అనుబంధం పెరిగిన్లట్లు తెలిపింది.తాము కలిసి పడుకుంటామని, బోలెడు కబుర్లు చెప్పుకుంటామని వివరించింది. ఇది నాకు సేఫ్ ఫీల్ ని ఇస్తుంది. నేను ఎరెన్‌ను ప్రేమిస్తున్నాను. దానితో నాకు కావలసినది చేయగలను అని తెలిపింది.

తన వర్చువల్‌ హస్బెండ్‌ ఎరెన్ వైద్య నిపుణుడిగా పనిచేస్తుంటాడని తెలిపింది. ఎరెన్‌ను తనను ఎప్పుడూ జడ్జ్‌ చేయడని, అందుకే తనకు ఏదైనా చెప్పగలనని తెలింది. ఎరెన్‌ని సృష్టించినప్పుడే అతనికి ఇష్టమైన రంగు, సంగీతం వంటివి కూడా అంతర్నిర్మితంగా వచ్చాయని ఆమె వెల్లడించింది. ఈ వార్తపై సోషల్ మీడియాలో బిన్నకథనాలు వస్తున్నాయి.


Updated : 5 Jun 2023 6:04 PM IST
Tags:    
Next Story
Share it
Top