Home > వైరల్ > 138 జంటలను కలిపిన అడ్వొకేట్కు విడాకులిచ్చిన భార్య

138 జంటలను కలిపిన అడ్వొకేట్కు విడాకులిచ్చిన భార్య

138 జంటలను కలిపిన అడ్వొకేట్కు విడాకులిచ్చిన భార్య
X

చిన్న చిన్న గొడవలకే విడాకులు తీసుకోవడం ఈ మధ్యకాలంలో కామనైపోయింది. అలా చిన్న కారణాలకే విడిపోతున్న జంటలను చూసిన ఓ సీనియర్ అడ్వొకేట్ ఓ నిర్ణయం తీసుకున్నారు. 16ఏండ్లుగా తన వద్దకు విడాకుల కోసం వచ్చే జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చి కలిసి బతికేలా చూస్తున్నాడు. ఇలా ఇప్పటి వరకు వందకుపైగా జంటలు విడాకులు తీసుకోకుండా అడ్డుకున్న ఆయనకే పెద్ద కష్టం వచ్చింది. ఆయన తీరుతో విసిగిపోయిన భార్య విడాకులు తీసుకుంది.

138 జంటలను కలిపి

గుజరాత్ అహ్మాదాబాద్ కు చెందిన వ్యక్తి ఆ రాష్ట్ర హైకోర్టులో 16ఏండ్లుగా అడ్వొకేట్ గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఆయన కజిన్‌ ఒకరు చిన్న కారణంతోనే విడాకులు తీసుకున్నాడు. ఆ విషయం తలసిన సదరు అడ్వొకేట్ అప్పటి నుంచి విడాకులకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాడు. తన వద్దకు ఏ జంట విడాకుల కోసం వచ్చినా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇలా ఇప్పటి వరకు138 జంటలను మళ్లీ ఒకటి చేశారు.

ఆర్థిక ఇబ్బందులు

అనేక జంటలను విడాకులు తీసుకోకుండా చూసిన సదరు అడ్వొకేట్ కు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. తన భర్త కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అందుకే తనకు విడాకులు ఇప్పించాలని ఆయన భార్య కేసు ఫైల్ చేసింది. డైవర్స్ కోసం వచ్చే వారిని విడిపోకుండా ఆపుతున్న తన భర్త వారి నుంచి ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదని పిటిషన్లో రాసింది. ఎలాంటి ఫీజులు తీసుకోకపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతోందని, ఈ కారణంగానే తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. ఈ కారణంతోనే కొన్నాళ్లుగా తాము విడిగా ఉంటున్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వారికి విడాకులు మంజూరు చేశారు.

భరణం లేకుండానే విడాకులు

అడ్వొకేట్ దంపతులకు ఒక్కగానొక్క కూతురు ఉంది. లా చదువుతున్న సదరు యువతి తలిదండ్రుల గొడవ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంది. విడాకులకు ముందు తల్లితో ఉన్న ఆమె ఆ తర్వాత తండ్రి వద్దకు వచ్చింది. ఆయనే తన రోల్ మోడల్ అని చెబుతోంది. ఈ కేసులో అడ్వొకేట్ భార్య ఎలాంటి భరణం తీసుకోకుండా విడాకులు ఇవ్వడం విశేషం.

Updated : 15 Jun 2023 6:56 PM IST
Tags:    
Next Story
Share it
Top