Home > వైరల్ > కూలీకి ఐటీ నోటీసులు.. రూ.లక్షల జీఎస్టీ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు

కూలీకి ఐటీ నోటీసులు.. రూ.లక్షల జీఎస్టీ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు

కూలీకి ఐటీ నోటీసులు.. రూ.లక్షల జీఎస్టీ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు
X

చదువుకోలేదు.. కూలీ పని చేసుకునే వాడని చిన్న చూపు చూసిన కొందరు.. దేవేంద్ర కుమార్‌ ను మోసం చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి లక్షల్లో డబ్బులు ముంచాలని చూశారు. విషయం తెలుసుకున్న దేవేంద్ర.. పోలీస్ లను ఆశ్రయించాడు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలో జరిగిందీ ఘటన. దేవేంద్ర కుమార్ ఆధార్, పాన్ తో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి, అతని పేరు మీద రెండు ఐటీ కంపెనీలు ఉన్నట్లు రిజిస్టర్ చేశారు. ఆ కంపెనీల నుంచి లక్షల్లో ట్రాన్ సాక్షన్స్, టర్నోవర్ జరగగా.. దానికి సంబంధించి లక్షల్లో జీఎస్టీ చెల్లించాలని నోటీస్ వచ్చింది. అది చూసిన దేవేంద్ర షాక్ తిని.. పోలీసులను ఆశ్రయించాడు.

రెండేళ్ల క్రితం నోయిడాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో కార్మికుడిగా పనిచేశాడు దేవేంద్ర. అక్కడ రోజుకు రూ. 300 కూలీ డబ్బులు వచ్చేవి. ప్రస్తుతం ఊళ్లో కూలి పని చేసుకుంటున్న దేవేంద్రకు మార్చి 13న ఘజియాబాద్ ఐటీ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది. అందులో అతనికి చెందిన జేకే ట్రేడర్స్ రూ. 136లక్షల టర్నోవర్ చేసిందని, దానికి రూ. 24.61 లక్షల జీఎస్టీ చెల్లించాలని ఉంది. ఏప్రిల్ 4న అలీఘడ్ ఆఫీస్ నుంచి మరో నోటీస్ వచ్చింది. దేవేంద్రకు చెందిన సర్వశ్రీ జేకే ట్రేడర్స్ తో స్క్రాప్ వస్తువులు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ రూ. 116.24 లక్షల జీఎస్టీ ఎగ్గొట్టినట్లు నోటీస్ వచ్చింది.

జీఎస్టీ నంబర్ ఎవరి పేరు మీద ఉందని తెలుసుకోగా.. ఘజియాబాద్ నివాసి జితేంద్ర సిసోడియాకు చెందినదిగా తేలింది. దాంతో షాక్ తిన్న దేవేంద్ర.. ఐటీ కంపెనీలో పనిచేసినప్పుడు తన డీటెయిల్స్ తీసుకుని ఫోర్జరీ చేశారని ఆరోపించాడు. పోలీస్ లను ఆశ్రయించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. న్యాయం చేయాలని కోరుతూ ఆఫీసులను కోరుతుంటే.. వాళ్లు మాత్రం ఆఫీసుల చుట్టు తిప్పుకుంటున్నారని మండి పడుతున్నాడు.

Updated : 12 July 2023 12:32 PM GMT
Tags:    
Next Story
Share it
Top