ఢిల్లీ మెట్రో సిత్రాలు..యువతి చేసిన పనికి అవాక్కైన ప్రయాణికులు
X
ఢిల్లీ మెట్రో.. ప్రయాణికుల విచిత్ర పనులతో తరుచూ వార్తల్లో ఉంటుంది. ప్రయాణికుల వింత చేష్టలు, ప్రేమ ముద్దులు,కొట్లాటలు, రీల్స్ వంటి వాటితో వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు హెచ్చరిక కూడా చేసింది. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయినా కొందరి ప్రయాణికుల విచిత్ర పనులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ యువతి చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.
మెట్రో ట్రైన్‌లో ఓ యువతి తన జుట్టును స్ట్రెయిట్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంట్లో టైం లేదో ఏమో కానీ ట్రైన్ లో హెయిర్ స్ట్రెయిటనర్ ఉపయోగించడం గమనార్హం. ఫోన్ ఛార్జింగ్ పెట్టే పవర్ అవుట్ లెట్లో స్ట్రెయిటనర్ను పెట్టి జుట్టును సరిచేసుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీనికి ఢిల్లీ మెట్రో కీ బాత్ హీ కుచ్ అలగ్ హై అనే క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తక్కువ టైంలోనే ఈ వీడియోకు 1.60 లక్షల లైకులు వచ్చాయి. ఢిల్లీ మెట్రో మల్టి పర్పస్ ట్రాన్స్ పోర్టుగా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘సిస్టర్.. వాషింగ్ మెషీన్ తెచ్చుకుని బట్టలు కూడా వాష్ చేసుకో, మేడమ్ కింద పడిన జుట్టుని తీసి పారేయండి.. ఇది రైలు మీ ఇల్లు కాదు, ఢిల్లీ మెట్రోలో ప్రయాణికులు అదుపుతప్పి పోయారు, ఇటువంటి పనులకు ఇంట్లో టైం లేదేమో’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Delhi Metro की बात ही अलग है!
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 17, 2023
😂😂😂😂😂😂 pic.twitter.com/zzy6nNLmbA