Home > వైరల్ > ఆ స్టోర్‌లో దొంగలను పట్టుకోవాలని చూస్తే ఉద్యోగాలు పోతాయి...

ఆ స్టోర్‌లో దొంగలను పట్టుకోవాలని చూస్తే ఉద్యోగాలు పోతాయి...

ఆ స్టోర్‌లో దొంగలను పట్టుకోవాలని చూస్తే ఉద్యోగాలు పోతాయి...
X

వారిద్దరు ఓ బట్టల షాపులో ఉద్యోగులు. వారు పనిచేస్తున్న స్టోర్‌లో దొంగలు పడ్డారు. అందరి సిబ్బందిలా వారు చూస్తు ఉండగా దొంగతనాన్ని అడ్డుకోవడానికి, దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎవరైనా ఆ సిబ్బంది చేసిన పనికి శభాష్ అంటారు. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. దొంగలు పట్టుకోవడానికి ప్రయత్నించారనే కారణంతో ఆ ఇద్దరు ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించారు. జార్జీయాలోని ప్రఖ్యాత దుస్తుల సంస్థ లులులెమన్ స్టోర్‌లో ఇది జరిగింది. యాజమాన్యం నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే లులులెమన్ సీఈఓ కాల్విన్‌ మెక్‌ డొనాల్డ్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

"ఉద్యోగులు తమ జీరో టోలరెన్స్ పాలసీ ఉల్లంఘించన కారణంగానే విధుల్లో నుంచి తొలగించాం. మా స్టోర్‌లో సిబ్బంది వ్యాపారాన్ని చూసుకోవాలి. దొంగతనం జరిగితే.. ఆ దొంగల్ని పట్టుకోవడానికి కావాల్సిన సాంకేతికత ఉంది. అలాగే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వీటన్నింటి గురించి మేం సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. దీనిపై జీరో టోలరెన్స్ పాలసీ రూపొందించాం. దీనిని దురదృష్టవాత్తు ఉద్యోగులు పాటించలేదు. అందుకే తమ ఉద్యోగాలను కోల్పోయారు. మాకు మా సిబ్బంది, వినియోగదారుల భద్రతే ముఖ్యం" అని కాల్విన్‌ మెక్‌ డొనాల్డ్ తెలిపాడు.

గత నెలలో అట్లాంటాలోని లులులెమన్ స్టోర్‌ ఇదే రకమైన ఘటన జరిగింది. దొంగతనం జరుగుతుంటే అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగిని దానిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో జీరో టోలరెన్స్ పాలసీ పాటించలేదని ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారు. లులులెమన్ యాజమాన్యం రూల్స్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.


Updated : 6 Jun 2023 8:21 PM IST
Tags:    
Next Story
Share it
Top