Home > వైరల్ > స్కూటీపై ఏడుగురు ప్రయాణం..వీడియో వైరల్

స్కూటీపై ఏడుగురు ప్రయాణం..వీడియో వైరల్

స్కూటీపై ఏడుగురు ప్రయాణం..వీడియో వైరల్
X

పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్నది పిల్లలతో వెళ్తున్న ఆటో అనుకుంటున్నారా..? అయితే మీరు పొరపాటు పడినట్లే. ఓ వ్యక్తి తన స్కూటీని సెవెన్ సీటర్ ఆటోగా మార్చేశాడు. ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కవ మంది ప్రయాణించడానికి వీలు కానీ స్కూటీపై ఏకంగా ఏడు మందిని తీసుకెళ్లాడు. వారందరూ స్కూల్ విద్యార్థులే.

ట్రాఫిక్ నిబంధనలు కాదుకదా, కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ముందు ఓ బుడ్డోడు కూర్చోగా వెనుక ముగ్గురు కూర్చున్నారు. మరో ఇద్దరు స్కూటీపై నిల్చుంటూ ప్రయాణించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియో ముంబైకి చెందినది అని తెలుస్తోంది. ఇప్పటికే స్కూటీ డ్రైవర్‌‎ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

రోడ్డు ప్రమాదాలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా..ఇటవంటి వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. వారి ప్రాణాలతో పాటు పక్కవారి ప్రాణాలను పణంగా పెట్టి డ్రైవింగ్ చేస్తున్నారు. చిన్నపిల్లలనే ఇంగితజ్ఞానం లేకుండా స్కూటీపై ఏడుగురిని ఎక్కించి డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.



Updated : 28 Jun 2023 8:15 AM IST
Tags:    
Next Story
Share it
Top