చంద్రుడిపై బెంగళూరు.. వీడియో వైరల్..
X
ప్రస్తుతం దేశ ప్రజలంతా చంద్రయాన్ 3 సక్సెస్ మూడ్లో ఉన్నారు. చంద్రయాన్కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆస్ట్రోనాట్ సూట్ ధరించిన వ్యక్తి.. వేరే గ్రహంపై నడుస్తున్నట్లు అందులో ఉంది. తీరా చూస్తే అతడు నడిచింది రోడ్డుపై. బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఈ వీడియో మూడేళ్ల క్రితం తీయగా.. ప్రస్తుతం వైరల్గా మారింది.
2019లో బెంగళూరులో రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను వెలుగులోకి తీసుకరావాలనుకున్న ఓ యువుకుడు వినూత్న రీతిలో వీడియో తీసి నెట్టింట పెట్టాడు. ఆస్ట్రోనాట్ సూట్ వేసుకుని రోడ్డుపై జాగ్రత్తగా నడుస్తూ.. అంతరిక్షంలోనే ఉన్నట్టుగా భ్రమ కల్పించాడు. ఫస్ట్ ఈ వీడియో చూసిన వారంతా నిజంగానే వేరే గ్రహంపై అనుకుంటారు. అయితే చివరకు వచ్చేసరికి రోడ్డుపై నడుస్తున్నట్లు కన్పించడంతో ఆశ్చర్యపోతారు.
ఈ వీడియోను 2019లో తీయగా.. ప్రస్తుతం చంద్రయాన్ సక్సెస్తో మరోసారి ఇది వైరల్గా మారింది. కొందరైతే చంద్రుడిపై పరిస్థితులు ఇలా ఉంటాయంటూ ఫేక్ పోస్టులు చేస్తున్నారు. మరికొందరు రోడ్లు ఎక్కడ బాగాలేవో.. అక్కడి పేర్లు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిని తెలిపేలా చాంద్రయాణగుట్టను చంద్రయాన్-3 గుట్ట అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
Guess what! #Bangalore based artist Badal Nanjudaswamy likens pot hole ridden crater filled city roads to craters. Dresses up like an astronaut, walks as if he navigating craters on the moon. pic.twitter.com/0ZKaZ1uFof
— Sourav Sanyal (@SSanyal) September 2, 2019