Home > వైరల్ > విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ అంటే ఆ మాత్రం ఉంటది.. వీడియో వైరల్

విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ అంటే ఆ మాత్రం ఉంటది.. వీడియో వైరల్

విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ అంటే ఆ మాత్రం ఉంటది.. వీడియో వైరల్
X

ఫీల్డ్ లో విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. తన చిలిపి చేష్టలు, డాన్స్ లతో ఆటగాళ్లలోనే కాదు.. ఆడియన్స్ లో కూడా ఉత్సాహాన్ని నింపుతాడు. అందుకే మైదానంలో కోహ్లీ ఉంటే ఆ జోషే వేరు అంటుంటారు. ప్రత్యర్థి ఎంతటోడైనా.. ఫ్యాన్స్ ను ఉత్సాహపరచడంలో కోహ్లీ ఏ మాత్రం వెనుక్కు తగ్గడు.

విండీస్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో విరాట్ డాన్సర్ అవతారమెత్తాడు. మూడో రోజు ఫీల్డింగ్ చేస్తూ డాన్సింగ్స్ మూమెంట్స్ తో అభిమానులను అలరించాడు. బ్యాక్ గ్రౌండ్లో వస్తున్న మ్యూజిక్ కు.. ఎవరిని పట్టించుకోకుండా విండీస్ ప్లేయర్ల మాదిరి తనదైన స్టైల్లో స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Updated : 15 July 2023 2:34 PM IST
Tags:    
Next Story
Share it
Top