Home > వైరల్ > హెడ్ కానిస్టేబుల్‏గా భార్యకు ప్రమోషన్..భర్త ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా?

హెడ్ కానిస్టేబుల్‏గా భార్యకు ప్రమోషన్..భర్త ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా?

హెడ్ కానిస్టేబుల్‏గా భార్యకు ప్రమోషన్..భర్త ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
X

భర్త కొంచం మెచ్చుకున్నా, పొగిడినా చాలు భార్య ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అలాంటిది తన సక్సెస్‎ను లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేస్తే ఇంకేముందు ఆ భార్య సంబరంతో గెంతులేస్తుంది. అలాంటి ఓ సర్ప్రైజ్‎ను తన భార్యకు ప్లాన్ చేసి ఆమెను ఫిదా చేశాడు హైదరాబాద్‎కు చెందిన ఓ భర్త.

భార్యకు హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ రావడంతో ఆ ఆనందాన్ని ఓ రేంజ్‎లో సెలబ్రేట్ చేశాడు. టపాసులు పేల్చి, కేక్ కట్ చేయించి విధుల నుంచి ఇంటికి వచ్చిన భార్యకు ఘనంగా స్వాగతం పలికాడు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్‎కు సంబంధించిన వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. భార్య కోసం భర్త ప్లాన్ చేసిన

సర్ప్రైజ్‎ను ముచ్చటగా చూస్తున్నారు నెటిజన్లు.

ప్రతి మగాడి విజయం వెనకాల స్త్రీ ఉన్నట్లే..ప్రతి స్త్రీ ఎదుగుదల వెనకాల పురుషుడు ఉంటాడని ఈ ఘటన రుజువుగా నిలుస్తుంది. భార్యకు హెడ్ కానిస్టేబుల్‎గా ప్రమోషన్ వచ్చిందిన హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్‌లో కు చెందిన ఓ భర్త ఊహించని విధంగా సెలబ్రేట్ చేశాడు. ఇక ఇంట్లో సంబరాలు చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. ఇంటికి వచ్చిన భార్యకు భర్త గ్రాండ్‎గా స్వాగతం పలికాడు. గుమ్మంలోనే బ్యాండు మేళాలతో ఫ్యామిలీ మొత్తం ఆమెకు స్వాగతం పలికారు. టపాసులు పేల్చారు. అంతటితో ఆగలేదు కేక్ కట్ చేశారు, డ్యాన్సులతో రచ్చ రచ్చ చేశారు. భర్త ఇలా తన సక్సెస్‎ను సెలబ్రేట్ చేస్తుంటే భార్య ముఖంలో ఆనందం చూడాలి. అది మాటల్లో వర్ణించలేనిది. ఇల్లంతా ఓ పండుగలా సందడిగా మారింది. భర్త తనపై చూపించిన ప్రేమకు భార్య ఫిదా అయిపోయింది.

ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతూనే , భర్తను పొగడ్తలతో ముంచేశారు. ఈ సంతోషాన్ని ఆమె లైఫ్ లాంగ్ మారిచిపోలేదని కామెంట్లు చేస్తున్నారు.




Updated : 22 July 2023 2:07 PM IST
Tags:    
Next Story
Share it
Top