దొంగ పిల్లి ఎంత పనిచేసింది.. పసికందును ఎత్తుకెళ్లి దారుణంగా..
X
కుటుంబ సభ్యుల ముఖాల్లో సంతోషాన్ని నింపుతూ.. ఇద్దరు కవలలు ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. వారసులొచ్చారని ఆ ఇంటి పెద్ద మనుషులు సంబరాలు చేశారు. కానీ, ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆ పసికందును ఓ దొంగ పిల్లి ఎత్తుకెళ్లి పొట్టన పెట్టుకుంది. ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బుడౌన్ జిల్లాలో జరిగింది. హసన్, అస్మా దంపతులకు 15 రోజుల క్రితం కవల పిల్లలు జన్మించారు. దాంతో ఊరంతా పిలిచి ఘనంగా వేడుక చేసి.. రిహాన్, అల్షిషా అని పేర్లు పెట్టారు.
అయితే, ఎంతో సంతోషంగా ఉన్న వీరి కుంటుంబంలో ఓ అడవి పిల్లి తీరని శోకాన్ని మిగిల్చింది. అర్థరాత్రి అందరూ పడుకున్న టైంలో కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చిన పిల్లి.. ఆ కవలల్లో ఒకరిని ఎత్తుకెళ్లింది. ఇంట్లో చప్పుడు వస్తుందని చూసిన కుటుంబ సభ్యులు లేచి చూడగా.. పిల్లి పసికందును నోటితో కరుచుకుని ఎత్తుకెళ్లడం కనిపించింది. దాంతో అంతా లేచి పిల్లి వెంట పడగా.. అది ఇంటి పైకప్పు ఎక్కి పిల్లాడ్ని తినబోయింది. కుటుంబ సభ్యులు గట్టిగా అరిచేసరికి.. ఆ పసికందును ఇంటిపై కప్పు పై నుంచి వదిలి పారిపోయింది. దాంతో కింద పడి ఆ పసికందు చనిపోయాడు. దాంతో ఆ పసికందు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.