పిల్లి కూన అనుకొని ఇంటికి తీసుకొచ్చింది.. చివరకి..
X
సహజంగానే ఆడవారికి కాస్త దయాగుణం ఎక్కువ. పేదవాళ్లని చూసినా.. మూగజీవాలను చూసినా.. వారి మనసు చలించిపోతుంది. ఆ క్షణంలో వారికి ఏదైనా చేతనైన సాయమో... లేదంటే ఆకలి తీర్చేందుకు పాలు లేదంటే ఆహారమో అందిస్తుంటారు. రష్యాకు చెందిన ఓ జంతు ప్రేమికురాలు కూడా అలాగే మూగజీవాల పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది. రోడ్డు పక్కన అచేతనావస్థలో పడి ఉన్న పిల్లి కూనను రక్షించి, ఇంటికి తెచ్చుకుని పెంచుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తెలిసి కంగుతింది. ఎందుకంటే ఆమె పెంచుకుంది పిల్లిని కాదు అక్షరాలా.. చిరుత పులి పిల్ల. తొలుత ఎవరో వదిలేసిన పెంపుడు పిల్లి పిల్ల అనుకుని తన వెంట ఇంటితీసుకొచ్చింది. తన పెంపుడు కుక్కతో పాటే దానికి స్నానం చేయించి.. ఆహారం అందించి చేరదీసింది. అయితే అది పెద్దదయ్యే క్రమంలో అది పిల్లి కాదని, బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) అని గ్రహించి ఆశ్చర్యానికి గురైంది. ఆ చిరుత పిల్ల, పెంపుడు కుక్కతో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ సదరు యవతి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
రష్యాకు చెందిన ఓ యువతి రోడ్డు పక్కన చెట్ల పొదల్లో చిక్కుకున్న నల్ల చిరుత పులి పిల్లను రక్షించింది. అది చూడడానికి అచ్చం పిల్లి పిల్లలా ఉండటంతో పిల్లే అనుకుని తనతోపాటు ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంది. కానీ అది పెరిగే కొద్దీ దానిలో పిల్లి లక్షణాలు కనిపించకపోవడంతో యువతికి అనుమానం కలిగింది. రోజులు గడిచే కొద్ది అది నల్ల చిరుత (బ్లాక్ పాంథర్) అని యువతి తెలుసుకుంది. అది చిరుత అయినప్పటికీ తన పెంపుడు కుక్కతోపాటు తనతోనే ఉంచుకుని అనుబంధం పెంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలుత బ్లాక్ పాంథర్ దొరికిన స్థితి నుంచి అది పెరిగి పెద్దదయి ఆడుకుంటున్న వరకు అన్నింటిని కలిపి చేర్చిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ వీడియోకు తెగ లైక్‌లు వస్తున్నాయి. ఇప్పటికే ఈవీడియోకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.