Home > వైరల్ > తలపై సిలిండర్తో మహిళ డ్యాన్స్.. అంతా షాక్.. వీడియో వైరల్..

తలపై సిలిండర్తో మహిళ డ్యాన్స్.. అంతా షాక్.. వీడియో వైరల్..

తలపై సిలిండర్తో మహిళ డ్యాన్స్.. అంతా షాక్.. వీడియో వైరల్..
X

గ్యాస్ సిలిండర్తో ఓ మహిళ చేసిన డ్యాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సిలిండర్ను తలపై పెట్టుకుని అలవోకగా డ్యాన్స్ చేసింది. అంతేకాకుండా బిందెపై నిల్చోని సిలిండర్తో డ్యాన్స్ చేసి అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఆమె అలా డ్యాన్స్ చేస్తుంటే వీడియో చూసేవాళ్లకే ఎక్కడి పడిపోతుందో అని భయం వేస్తోంది. కానీ ఆమె ఏ భయం లేకుండా హాయిగా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలా రిస్కీ స్టంట్స్ చేయొద్దని పలువురు సూచిస్తున్నారు. వాట్ ఏ టాలెంట్ అని మరికొందరు అంటుంటే.. ఇటువంటి విన్యాసాలతో జీవితం ప్రమాదాల్లో పడుతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు లక్షా 83వేల లైక్స్ వచ్చాయి.




Updated : 3 Oct 2023 9:55 PM IST
Tags:    
Next Story
Share it
Top