Home > వైరల్ > కేదార్‌నాథ్ గుడివద్ద లవ్ ప్రపోజల్.. తిట్లు, కంగ్రాట్స్

కేదార్‌నాథ్ గుడివద్ద లవ్ ప్రపోజల్.. తిట్లు, కంగ్రాట్స్

కేదార్‌నాథ్ గుడివద్ద లవ్ ప్రపోజల్.. తిట్లు, కంగ్రాట్స్
X

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయంలో ఓ జంట చేసిన పనిపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. వారు ఏ తప్పూ చేయలని కొందరు, హిందూ సంస్కృతి సంప్రదాయాలను మంటగలిపారని కొందరు గొడవపడుతున్నారు. ఆ జంటకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. పసుప్పచ్చ దుస్తులు దరించిన యువతీ, యువకుడు మొదట గుడి ముందు నిల్చుని దండం పెట్టుకున్నారు. తర్వాత యువతికి ఎవరో వెనకవైపు నుంచి ఉంగరం అందించారు. ఆమె నవ్వుతూ మోకాలి మీద కూర్చుని అతనికి ప్రపోజ్ చేసింది. అతడు ఆశ్చర్యపోయి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు.

పవిత్ర స్థలంలో ఇలాంటి పనులు చేయడం సరికాదని కొందరు హిందూ మతాభిమానులు మండిపడుతున్నారు. వేరే మతాల వాళ్లు ఇలా చేయరని, హిందూ మతంలోనే ఇలాంటివి అనుచితాలు జరుగతుంటాయని అంటున్నారు. అయితే గుళ్లలోనే పెళ్లిచేసుకునే హిందూ సంస్కృతికి ఇది విరుద్ధమేం కాదని, వాళ్లు ఏ తప్పూ చేయలేని కొందరు వత్తాసు పలుకున్నారు. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేసిన వ్యక్తి, ‘‘ప్ర‌ముఖ ప్రార్థన మందిరాల వద్ద స్మార్ట్‌ఫోన్లను నిషేధించాలి. 20 కిలోమీట‌ర్ల ప‌రిధిలో కేవలం బేసిక్ ఫోన్ల‌ను మాత్రమే అనుమ‌తిస్తే ఇలాంటివి జరగవు’’ అని కామెంట్ పెట్టాడు.

Updated : 2 July 2023 7:08 PM IST
Tags:    
Next Story
Share it
Top