సెలూన్లో షేవింగ్ చేసుకున్న అమ్మాయి.. చెప్పిన కారణం వింటే అవాక్కే..
X
మగవారు సెలూన్కు వెళ్లడం కామన్. సెలూన్కు వెళ్లి కటింగ్, షేవింగ్ చేసుకుంటారు. కానీ ఓ చోట అమ్మాయి సెలూన్కు వెళ్లింది. అబ్బాయిల వలె షేవింగ్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
అసలు వీడియోలో ఏముందంటే.. ఓ అమ్మాయి సెలూన్ షాపుకు వెళ్లింది. మగవాళ్లు చేసుకున్నట్లే షేవింగ్ చేసుకుంది. బార్బర్ ఆమె ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి ఆమెకు షేవింగ్ చేశాడు. అబ్బాయిలకు ఉపయోగించే బ్లేడ్ తోనే ఆమెకు షేవ్ చేశాడు. ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
అసలు ఆమె అమ్మాయేనా అని కొందరు కామెంట్ చేయగా.. ఆడవాళ్లు కూడా అన్నింట్లో మగవారితో సమానమే అని మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఇలాంటి వింతలు జరుగుతాయని, ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి మాత్రం అందం కోసమే షేవింగ్ చేసుకున్నట్లు తెలిపింది. రోజూ షేవింగ్ చేసుకోవడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుందని చెప్పింది.
बदलाव प्रकृति का नियम है। 😌😌 pic.twitter.com/HjAeu4kUOv
— Cyber Huntss (@Cyber_Huntss) August 3, 2023