Home > వైరల్ > రోజులు నడుస్తున్నై అలాగ.. క్యాబ్లో తిరిగి.. డబ్బులివ్వమంటే దబాయించింది

రోజులు నడుస్తున్నై అలాగ.. క్యాబ్లో తిరిగి.. డబ్బులివ్వమంటే దబాయించింది

రోజులు నడుస్తున్నై అలాగ.. క్యాబ్లో తిరిగి.. డబ్బులివ్వమంటే దబాయించింది
X

ఎక్కడికి వెళ్లాలో తెలియదు.. ఏ రూట్ లో వెళ్లాలో తెలియదు.. చేతిలో ఫోన్ ఉంది కదా అని స్టైల్ గా యాప్ తెరి క్యాబ్ బుక్ చేసింది. తర్వాత డెస్టినేషన్లు మార్చుతూ.. ఆ క్యాబ్ ను సిటీలోనే 13 గంటలు తిప్పింది. తీరా డబ్బులివ్వమని అడిగితే దాబాయించింది. తప్పుడు కేసులో వేసి.. జైల్ లో పెట్టిస్తానని బెదిరించింది. గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జ్యోతి అనే ఓ మహిళ జులై 25 అర్థరాత్రి ఓలా యాప్ లో క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్ లో ఎక్కి కూర్చున్నాక.. డెస్టినేషన్స్ మార్చుతూ.. మరుసటి రోజు (జులై 26) ఉదయం 11 గంటల వరకు ఆ డ్రైవర్ ను తిప్పించుకుంది. జ్యోతి ఏం చేస్తుందో అర్థం కాని క్యాబ్ డ్రైవర్ దీపక్.. సైబర్ సిటీలో కారు ఆపి.. అసలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించాడు. తాను చెప్పకపోవడంతో ఇప్పటి వరకు అయిన ట్రిప్ డబ్బు చెల్లించాలని జ్యోతిని కోరాడు.

అదంతా చూసిన జ్యోతి.. డ్రైవర్ పై ఫైర్ అయింది. డబ్బులు అడిగితే లైంగిక వేధింపుల లాంటి తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తానని బెదిరించింది. దాంతో ఏం చేయాలతో తోచని క్యాబ్ డ్రైవర్ దీపక్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జ్యోతిని మందలిచారు. సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపిచ్చుకోని జ్యోతి పోలీసుల మీదికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఈ ఘటనంతా అక్కడే ఉన్న ఓ మహిళ వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసింది. అదికాస్త క్షణాల్లో వైరల్ అయింది. అయితే, జ్యోతిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకున్నారో తెలియరాలేదు. గతంలో కూడా జ్యోతి ఇలానే ప్రవర్తించింది. గతంలో కూడా క్యాబులు బుక్ చేసుకుని.. డబ్బులు చెల్లించకుండా వేధింపుల కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు మరో వీడియో రిలీజ్ అయింది.

Updated : 30 July 2023 2:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top