రైలులో రచ్చ.. చెప్పులతో కొట్టుకున్న మహిళలు
X
కొంతమంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు. ఇక మహిళలైతే చెప్పనక్కర్లేదు. ఎంతమంది మగాళ్లు కలిసి ఉన్నా రెండు సిగలు కలిసి ఉండవు అంటారు. ఇప్పుడు కోల్‌కతా లోకల్‌లో ట్రైన్ అదే జరిగింది. లేడీస్ కోచ్లో మహిళలు ఘర్షణకు దిగారు. చెప్పులతో కొట్టుకుంటూ రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
కలకత్తా లోకల్ ట్రైన్‌లో మహిళలు వీరంగం సృష్టించారు. ఒకరినొకరు జట్లు పట్టుకుని చెప్పులతో కొట్టుకున్నారు. బూతులు తిట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. మహిళా కంపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Kolkata local🙂 pic.twitter.com/fZDjsJm93L
— Ayushi (@Ayushihihaha) July 11, 2023
ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైన్‌లో ఉచితంగా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ చూడొచ్చు అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇది ముంబై గొడవకు ప్రో వర్షన్ అని మరో యూజర్.. క్లినిక్ ప్లస్ యాడ్‌లా ఉందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు. మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది.. కానీ ఇలాంటి ఘటనలు కూడా చూడాల్సి రావడం సిగ్గుచేటు అని మరో యూజర్ కామెంట్ చేశాడు.