Home > వైరల్ > మెట్రోలో ఈ యువతి ఏం చేసిందో చూడండి...వీడియో వైరల్

మెట్రోలో ఈ యువతి ఏం చేసిందో చూడండి...వీడియో వైరల్

మెట్రోలో ఈ యువతి ఏం చేసిందో చూడండి...వీడియో వైరల్
X

ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. నిత్యం ఏదో ఒక వీడియో బయటకువస్తూనే ఉంది. లవర్స్ రొమాన్స్, డ్యాన్స్ చేయడం, ఫైటింగ్ సీన్స్ వంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది తమ చేష్టలతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తమ టాలెంట్‌ను ఢిల్లీ మెట్రో వేదికగా చూపించాలనే తాపత్రయంతో రకరకాల ఫీట్లు చేస్తున్నారు. వీటిని నిలువరించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో జరిగిన మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ యువతి రద్దీగా ఉన్న మెట్రోలో తన విన్యాసాలను ప్రదర్శించింది. అథ్లెట్ నైపుణ్యాలు ఉన్న మిషా శర్మ అనే యువతి ఫీట్లు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఫ్రంట్ జంప్ చేస్తూ తన టాలెంట్‌ను చూపెట్టింది. ఈ తన ఇన్ స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. అయితే ఆమె నైపుణ్యాన్ని కొంతమంది మెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిని తప్పుబడుతున్నారు. మెట్రోలో అలా చేయడం సరికాదని...ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతారని కామెంట్స్ చేశారు.


Updated : 20 Aug 2023 3:28 PM IST
Tags:    
Next Story
Share it
Top