Home > వైరల్ > బ్యాక్ గ్రౌండ్‎లో దీపికా పాట..స్టేజ్ మీద అమ్మాయి ఆట..వీడియో వైరల్

బ్యాక్ గ్రౌండ్‎లో దీపికా పాట..స్టేజ్ మీద అమ్మాయి ఆట..వీడియో వైరల్

బ్యాక్ గ్రౌండ్‎లో దీపికా పాట..స్టేజ్ మీద అమ్మాయి ఆట..వీడియో వైరల్
X

బాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన అందమైన ప్రేమకావ్యం రామ్-లీలా . ఈ సినిమాలో రణ్‎వీర్ సింగ్,దీపికా పదుకొణెలు అద్భుతంగా నటించారు. అందులోనూ దీపికా తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‎తో సినీ లవర్స్‎ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని హైలెట్ సాంగ్ "నగాడ సంగ్ డోల్ భాజే"లో దీపికా డ్యాన్స్ చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ఆ పాటకే ఓ యువతి డ్యాన్స్ చేసి ఇంటర్నెట్‎ను షేక్ చేస్తోంది. బ్యాక్ గ్రౌండ్‎లో దీపికా డ్యాన్స్ వీడియో ప్లే అవుతుండగాస్టేజ్ మీద యువతి దుమ్ముదులిపేసింది. ఈ యువతి డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ గుజరాతీ గర్బా డ్యాన్స్ ను ఎంతో చక్కగా చేసింది. దీపికా పదుకొణె కదలికలను ప్రతిబింభించేలా నృత్యం చేసి అందరిని మెస్మరైజ్ చేసింది.

ఈ వీడియోలో తన డ్యాన్స్ తో అలరించిన యువతి క్రీతి. ఆమె అచ్చం దీపికా మాదిరిగానే ఎరుపు రంగులో ఉండే సంప్రదాయ దుస్తులను ధరించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒరిజినల్ పాట వీడియో ప్లే అవుతుండగా స్టేజ్‌పై క్రీతి డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‎ను లైవ్ గా చూసిన ప్రేక్షకులు ఇంటర్నెట్ వినియోగదారులు ఆమె ప్రతిభను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ డ్యాన్స్ వీడియోను వారం క్రితం క్రీతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు లైక్‌లు షేర్లు, కామెంట్ల వర్షం కురిసింది. హ్యాట్సాఫ్ క్రీతి అంటూ పొగడ్తలతో ముంచేశారు నెటిజన్స్. ఇప్పటి వరకు క్రీతి డ్యాన్స్ వీడియోకు 7 లక్షలకు పైగా లైక్‌లు, 300 కంటే ఎక్కువ కామెంట్లు వచ్చాయి. 84,000 మంది ఇన్‌స్టాగ్రామ్‎లో ఈ వీడియోను షేర్ చేశారు.


Updated : 30 Sept 2023 9:20 AM IST
Tags:    
Next Story
Share it
Top