Home > వైరల్ > హిజ్రాతో యువకుడి ప్రేమ..వేములవాడలో ఘనంగా పెళ్లి

హిజ్రాతో యువకుడి ప్రేమ..వేములవాడలో ఘనంగా పెళ్లి

హిజ్రాతో యువకుడి ప్రేమ..వేములవాడలో ఘనంగా పెళ్లి
X

ప్రేమ.. దీనికి ఆడ, మగ అనే తేడా లేదు. ఆడ, మగ ప్రేమించుకోవడం కాదు.. ఇద్దరూ ఆడవాళ్లు లేదా మగవాళ్ల మధ్య ప్రేమించుకోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది. అంతేకాకుండా హిజ్రాలను ప్రేమించి.. పెళ్లి చేసుకునేవాళ్లూ ఉన్నారు. ఐదేళ్లుగా హిజ్రాతో సహజీవనం చేసిన ఓ యువకుడు తాజాగా ఆమెను పెళ్లి చేసుకుని తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. వీరి పెళ్లికి వేములవాడ రాజన్న సాక్షి అయ్యాడు.

హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడికి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పింకీ అనే 22 ఏళ్ల హిజ్రాతో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ డిగ్రీ చదివి.. ప్రస్తుతం ఆటో నడుపుతున్నాడు. వీరి పరిచయం కాస్త ప్రేమ మారి సహజీవనం వరకు వెళ్లింది. ఐదేళ్ల సహజీనం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ వేములవాడ రాజన్న సన్నిధిలో మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటైంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated : 17 Jun 2023 9:19 PM IST
Tags:    
Next Story
Share it
Top