Home > వైరల్ > బ్రో జాగ్రత్త...మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను

బ్రో జాగ్రత్త...మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను

బ్రో జాగ్రత్త...మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను
X

పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో. రేపు శుక్రవారం ఈ సినిమా విడుదల అవుతోంది. మెగా ఫాన్స్ అందరూ దీనికోసం తెగ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ గా టికెట్స్ అన్నీ బుక్ కూడా అయిపోయాయి. కానీ నిన్నటి నుంచి పడుతున్న భారీ వర్షాలు ఫ్యాన్స్ ను వర్రీ చేస్తున్నాయి. కానీ ఎలా అయినా సినిమా చూసేయాలని మెగా ఫ్యాన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే వీళ్ళ కోసం సాయిధరమ్ తేజ్ ఒక లెటర్ విడుదల చేశారు. వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి బ్రో...జాగ్రత్త అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

సాయి ధరమ్ తేజ్ కి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పిడుగులు పడ్డా, భూమి బద్ధలైపోయిన తన హీరో సినిమా చూడ్డానికి వచ్చేస్తారు. జై పవర్ స్టార్ అనడానికి....సినిమా ఎలా ఉన్నా హిట్ చేయడానికి వీళ్ఉళ ఎప్పుడూ ముందే ఉంటారు. పవన్ కల్యాణ్ మీదన ఈగ కూడా వాలనివ్వరు. ఈ విషయంలో డౌటే లేదు. అందుకే ఇంత వర్షాల్లో కూడా బ్రో కలెక్షన్ల మీద ఎవ్వరికీ డౌట్లు రావడం లేదు. కానీ ఎంత మెగా సినిమా అయినా...ఫ్యాన్స్ కు పండగే అయినా కూడా ఇంతలా వర్షాలు పడడం అందరికీ ఇబ్బందే కదా అనుకున్నాడు మెగా అల్లుడు. అందుకే బాధ్యతాయుతంగా సోషల్ మీడియాలో ఓ లెటర్ ను విడుదల చేశాడు. మా సినిమాకు మీ సపోర్ట్ తప్పకుండా కావాలి.కానీ మీ సేఫ్టీ కూడా నాకు ముఖ్యమే అంటూ అందులో రాసుకొచ్చాడు.

అంతేకాదు కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పాడు తేజ్. మా చిత్రాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందం కలిగిస్తోంది. మీ ప్రేమను పొందుతున్నందుకు గర్వంగా ఉంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా వ్యవహరించండి. మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు ఎంతో ముఖ్యం అంటూ లెటర్ లో జాగ్రత్తలు చెప్పాడు. మీకు ఏదైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను అంటూ భావోద్వేగంగా లెటర్ రాసుకొచ్చాడు. తేజ్ లెటర్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎంతైనా మెగా అల్లుడు కదా...ఇలాగే ఉంటాడు అంటూ తేజ్ బ్రో ని తెగ పొగిడేస్తున్నారు.

Updated : 27 July 2023 3:22 PM IST
Tags:    
Next Story
Share it
Top