Home > వాతావరణం > తీవ్ర వడగాల్పులు.. వచ్చే 3 రోజులూ జాగ్రత్త...

తీవ్ర వడగాల్పులు.. వచ్చే 3 రోజులూ జాగ్రత్త...

తీవ్ర వడగాల్పులు.. వచ్చే 3 రోజులూ జాగ్రత్త...

తీవ్ర వడగాల్పులు.. వచ్చే 3 రోజులూ జాగ్రత్త...
X




వచ్చే మూడు రోజులపాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో వడగాల్పుల తీవ్ర పెరుగుతందని తెలిపింది. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఐఎండీ.. ప్రజలకు కీలక సూచనలు చేసింది.ఎండలో బయటకు వెళ్లకపోవడమే మేలని .. ఒకవేళ బయటకు వెళ్తే తలకు తప్పనిసరిగా వస్త్రం చుట్టుకోవాలని, గొడుగు తీసుకెళ్లాలని సూచించింది. దాహం వేయకున్నా.. నీరు తాగాలని, దీని వల్ల డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండొచ్చని తెలిపింది. వృద్ధులు, చిన్నారులు ఇంట్లో తయారు చేసుకునే మజ్జిగ, నిమ్మరసం, లస్సీ తాగాలని తెలిపింది.





ఇక ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 24 వరకు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహించనున్నారు. వేసవి సెలవులు అనంతరం జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. ఎండలు తగ్గని కారణంగా జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అయితే ఇప్పటికీ ఉష్ణోగ్రతల్లో మార్పు లేకపోవడంతో ఒంటి బడులును పెంచింది. వడ గాలులు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. స్కూల్స్‌కు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించాలని డిమాండ్‌లు వచ్చినా ఒంటి పూట బడుల నిర్వహణకే విద్యాశాఖ మొగ్గు చూపింది.





మరోవైపు ఉత్తరాదిన కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు రోజుల్లోనే వడదెబ్బ కారణంగా అక్కడ 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బలియా జిల్లాలోనే గడిచిన 24 గంటల వ్యవధిలో 34 మంది చనిపోవడం కలవరపెడుతోంది. మరోవైపు బిహార్‌లోనూ 44 మంది వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వడగాల్పుల నేపథ్యంలో బీహార్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పట్నా, షేక్‌పురాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా అక్కడి విద్యాసంస్థలకు జూన్‌ 24వరకు సెలవులు పొడిగించారు.




Updated : 19 Jun 2023 8:47 AM IST
Tags:    
Next Story
Share it
Top