Home > వాతావరణం > నైరుతి రుతుపవనాల రాక..హైదరాబాద్‌లో వర్షం

నైరుతి రుతుపవనాల రాక..హైదరాబాద్‌లో వర్షం

నైరుతి రుతుపవనాల రాక..హైదరాబాద్‌లో వర్షం
X

హైదరాబాద్ వాసులకు మండే ఎండల నుంచి ఉపశమనం లభించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుతుపవనాలు నగరంలో అడుగుపెట్టాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బుధవారం సాయత్రం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్ సైదాబాద్, దిల్ షుఖ్ నగర్, తార్నాక, లాలాపేట్, ఓయూ, అంబర్ పేట్, కాప్రా, మల్కాజిగిరి, హైటెక్ సిటీ, కొండాపూర్, ప్రాంతాల్లో చిరుజల్లు పడ్డాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసులు ముగిసే సమయంలోనే వర్షం కురుస్తోండటంతో ఉద్యోగులు, ప్రయాణికులు, ఇబ్బందులు పడుతున్నారు. రుతుపవనాల ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌‌‌తో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. చాలా రోజుల తర్వాత ఎండ వేడి నుంచి విముక్తి లభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 21 Jun 2023 7:27 PM IST
Tags:    
Next Story
Share it
Top