AP Alert : ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుతుపవనాలు ఊపందుకున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులూ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా ఈ నెల 17న లేదా 18న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యలో ఈ నెల మొత్తం రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే గత 48 గంటలుగా వానలు దంచికొడుతున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఈ నెల 16న ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది కాస్త ఈ 17న లేదా 18న అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. జులై నెల మూడో వారంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది.