మళ్ళీ ముంచుకొస్తున్నాయి-తెలుగు రాష్ట్రాలకు కొత్త అల్పపీడనం
X
మూడురోజులుగా ఎడతెగని వర్ణాలు తెలుగు రాష్ట్రాలను ముంచేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త అల్పపీడనం ముంచుకొచ్చేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం హై అలర్ట్ ప్రకటించింది.
ఈరోజు ఆంధ్ర, తెలంగాణల్లో భారీ వర్షాలు పడతాయని చెబుతోంది భారత వాతావరణ శాఖ. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఈ నెల 24న మరో అల్ప పీడనం పొంచి ఉందని తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్‌లలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు కుములోనింబస్ మేఘాలు కారణం. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండి ఫాస్ట్ గా కదులుతుంటాయి. దానివల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. అందుకే అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు. మరోవైపు వర్షాలు కారణంగా నదులు, వాగులు, వంకలూ ఉప్పొంగుతున్నాయి. వరద పోటెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అల్పపీడనం వలన వర్షాలు పడితే పరిస్థితి చేయి దాటిపోతుందని అధికారులు టెన్షన్ పడుతున్నారు.