మేడారంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది

By :  Bharath
Update: 2024-02-22 14:23 GMT

మేడారం జాతరలో గురువారం (ఫిబ్రవరి 22) ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. గద్దెపై సమ్మక్క కొలువుదీరారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క చిలకలగుట్ట దిగి జనం మధ్యలోకి చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క అమ్మకు ఘన స్వాగతం పలికారు. ఎస్పీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతించారు. అనంతరం సమ్మక్క మేడారానికి బయలెల్లింది. అంతకుముందు చిలకలగుట్టకు ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. డోలు చప్పుళ్లు, సన్నాయి వాయిద్యాలు, గిరిజన నృత్యాలతో సమ్మక్కను మేడారానికి తీసుకొచ్చారు.

కాగా చిలకలగుట్టకు వెళ్లకముందే పూజారులు గ్రామ శివారులోని సమ్మక్క గుడిలో పూజలు చేశారు. సాయంత్రం గద్దెలపై వెదురు కర్రలను ఉంచారు. ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్కను గద్దెపైన కొలువుదీర్చారు. మరో వైపు సమ్మకు స్వాగతం పలుకుతూ దారి పొడువునా మహిళలు ముగ్గులను అలంకరించారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. మరో వైపు మేడారం భక్తులతో కిక్కిరిపోయింది.


Tags:    

Similar News