IND vs BAN: విరాట్, బుమ్రాలకు రెస్ట్.. కుర్రాళ్లకు గోల్డెన్ ఛాన్స్

Byline :  Bharath
Update: 2023-09-15 10:22 GMT

కొలంబో వేదికపై జరుగుతున్న నామమాత్రపు సూపర్ 4 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లా.. 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 29 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్, కుల్దీప్, సిరాజ్ లకు రెస్ట్ ఇచ్చారు. వారి స్థానంలో శార్దూల్, తికల్ వర్మ, అక్షర్ పటేల్, షమీలను జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లా చిక్కుల్లో పడింది. శార్దూల్ (2 వికెట్లు), షమీ (1 వికెట్) దాటికి కష్టాల్లో పడింది. కెప్టెర్ షకిబల్ హసన్ (9), మెహిడీ హసన్ (1) క్రీజులో ఉన్నారు. గాయం నుంచి ఇంకా కోలుకోని శ్రీయస్ అయ్యర్ ను బెంచ్ కే పరిమితం చేశారు. అతని ఫిట్ నెస్ ప్రశ్నార్థకంగా మారింది. గాయం తగ్గకపోతే వరల్డ్ కప్ కు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే తిలక్ వర్మ లేదా సంజూ శాంసన్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది.




 


తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(w), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్ (wk), తాంజిద్ హసన్, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్ (c), తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రెహమాన్




 






Tags:    

Similar News